ప్రభాస్ రాజా డీలక్స్ సినిమా ఎక్కడి వరకు వచ్చింది?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు ఐదు నెలలుగా తెగ వార్తలు వచ్చాయి.రాజా డీలక్స్ అంటూ కూడా సినిమా టైటిల్ తో ఆసక్తిని రేకెత్తించారు.

 Prabhas And Maruthi Movie Update Prabhas, Maruthi , Tollywood, Project K , Sala-TeluguStop.com

అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు అంతా కూడా సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏమీ రాకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాజా డీలక్స్ గురించి ఎక్కువగా ప్రచారం జరిగింది.ఆ సినిమా సక్సెస్ అయితే ఇప్పటి వరకు రాజా డీలక్స్ సినిమా ప్రారంభం అయ్యేది కానీ ఆ సినిమా నిరాశపర్చడం వల్ల రాజా డీలక్స్ సినిమాకు కాస్త జాప్యం జరుగుతుంది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్టోరీ మరియు స్క్రీన్ ప్లేకు చర్చలు జరుగుతున్నాయని మారుతి కాంపౌండ్ నుండి సమాచారం అందుతుంది.ప్రభాస్ ఒక వైపు ప్రాజెక్ట్‌ కే మరోవైపు సలార్ సినిమాలు చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రాజా డీలక్స్ సినిమా కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.అయితే రాజా డీలక్స్ కి సంబంధించి గత రెండు నెలలుగా ఎలాంటి హడావుడి కానీ.

చర్చకానీ లేకపోవడంతో మారుతికి ఓకే చెప్పినట్టే చెప్పి దర్శకుడు మారుతి చెప్పిన కథకు నో చెప్పాడు ప్రభాస్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.అందులో నిజం ఎంత ఉంది అనేది క్లారిటీ లేదు కానీ త్వరలోనే రాజా డీలక్స్ ప్రారంభం అవుతుంది అనుకున్న వారికి కాస్త ఇబ్బందికరంగానే మారింది, ఆ వార్తలు నిజం కాకూడదని కొందరు కోరుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం ప్రభాస్ రాజ డీలక్స్ కాకుండా సలార్, ప్రాజెక్టు కే వంటి భారీ సినిమాలు మరికొన్ని చేయాలంటూ కోరుకుంటున్నారు.

Telugu Danayya, Maruthi, Prabhas, Prabhas Maruthi, Project, Salar, Tollywood-Mov

ప్రభాస్ మరియు మారుతీల కాంబినేషన్లో సినిమాపై చాలా మంది ఆసక్తిగా చపడం లేదు అనేది మరికొందరి టాక్.వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఇలాంటి చిన్న సినిమా చేయడం మంచిదే అనేది మరికొందరి అభిప్రాయం.సినిమా ప్రారంభమైతే కేవలం మూడు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను మారుతి ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు.100 కోట్లు ప్రభాస్ పారితోషికం కాక మరో 50 కోట్లతో సినిమాను చేయబోతున్నారంట.అంటే 150 కోట్లతో మారుతి దర్శకత్వంలో సినిమా దానయ్యను నిర్మించబోతున్నాడు.ప్రభాస్ మరియు మారుతీల కాంబో సినిమా రాజా డీలక్స్ త్వరగా పట్టాలెక్కి ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుండు అంటూ కొందరు ఆసక్తిగా ఉంటే మరి కొందరు మాత్రం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అవసరమా అన్నట్లుగా చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube