అమ్మాయి బాగుంది సినిమా తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మీరా జాస్మిన్.ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది.
కాని కొన్ని తప్పుడు నిర్ణయాలు.సినిమాల ఎంపిక విషయంలో పరిపక్వతను కనబర్చక పోవడం వల్ల ఈ అమ్మడు పూర్తిగా విఫలం అయ్యింది.
హీరోయిన్ గా కొంత కాలం బిజీగా ఉన్నా కూడా ఆ తర్వాత ఈ అమ్మడి సినిమాలు తక్కువ అయ్యాయి.మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
వయసు పెరిగిన నేపథ్యంలో ఈ అమ్మడికి మళ్లీ ఆఫర్లు వస్తాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.నిజంగానే సినిమాలు ఆఫర్లు తగ్గాయి.
కొన్నాళ్ల పాటు మలయాళం ఇతర భాషల్లో కొన్ని సినిమాల్లో నటించినా కూడా అక్కడ కూడా ఈమెకు లక్ కలిసి రాలేదు.కొంత కాలం గ్యాప్ తర్వాత మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు ఆమె రీ ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.హీరోయిన్స్ రీ ఎంట్రీ అంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చేసుకోవాల్సిందే.
అమ్మగా లేదా అక్కగా అయితే మీరా జాస్మిన్ ఇప్పుడే చేసే అవకాశం లేదు.ఆమె హీరోయిన్ పాత్రల కోసం అన్నట్లుగా అందాల ఆరబోత చేస్తూ గత కొన్నాళ్లుగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా హీట్ పుట్టించే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ అమ్మడి జోరుకు అంతా కూడా అవాక్కవుతున్నారు.తాజాగా కూడా ఇలా క్లీ వేజ్ షో తో బాబోయ్ అనిపిస్తుంది.
ఇంత అందాల ఆరబోత చేస్తున్న ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చేనా అనేది అనుమానమే అంటున్నారు.గతంతో పోల్చితే ఇప్పుడు నాజూకుగా అందంగా కనిపిస్తున్న మీరా జాస్మిన్ కు ఆఫర్లు వస్తే బాగుండు అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
మరి ఆమెకు ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.







