జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.శ్రీకాకుళం జిల్లా గార మండలం లింగాలవలసలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో పవన్ పోస్టర్ లో స్థానిక యువత ఫొటోలు చూసి అసహనానికి గురి అయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.
ప్రజా జీవితం మాటలు చెప్పినంత సులువు కాదన్నారు.అధికారంతో సంబంధం లేకుండా 45 ఏళ్లు ప్రజా జీవితంలో ఉన్నట్లు చెప్పారు.
ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వం గుర్తించాలే తప్ప సినిమా పోస్టర్ల మీద ఫోజులిస్తే ప్రయోజనం ఉండదన్నారు.పవన్ రాజకీయంగా నడుస్తానన్నారు.
అది సాధ్యమా ? అని ప్రశ్నించారు.ఇప్పుడు తన వయస్సు 64 సంవత్సరాలని, తనతో 3 కిలో మీటర్లు కూడా సమానంగా నడవలేరని వ్యాఖ్యనించారు.







