టాలీవుడ్ లో సక్సెస్ సెంటిమెంట్స్ ను ఎక్కువ గా నమ్ముతూ ఉంటారు.ఆ మధ్య వరుసగా సినిమా లు సక్సెస్ అయ్యాయి.
ఆ సినిమా లకు బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు చేశాడు.దాంతో ఆయన తో వరుసగా అయిదు వారాల పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు వచ్చాయి.
హీరోలు మరియు హీరోయిన్స్ అంతా కూడా బిత్తిరి సత్తి వెంట పడ్డారు.బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ లకు సంబంధించిన సినిమా లు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
దాంతో బిత్తిరి సత్తి హడావుడి తగ్గింది.ఇప్పుడు సందడి అంతా కూడా వైవా హర్షది కనిపిస్తుంది.
మొన్న బింబిసార సినిమాకు ప్రమోషన్ లో భాగంగా వైవా హర్ష విభిన్నమైన వీడియోను విడుదల చేశారు.చాలా ఫేమస్ అయిన వైవా థీమ్ తో ప్రమోషన్ వీడియో ను చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
అందుకే ఇప్పుడు మరో సారి ఆయన ముందు వైవా కోసం మరో సినిమా యూనిట్ సభ్యులు కూర్చున్నారు.వారే మాచర్ల నియోజక వర్గం టీమ్.నితిన్ తో పాటు హీరోయిన్ కృతి శెట్టి మరియు దర్శకుడు రాజ శేఖర్ రెడ్డి కూడా వైవా హర్ష ఇంటర్వ్యూలో కూర్చున్నాడు.

ముగ్గురిని వైవా అడిగిన హర్ష వీడియో తో అలరించబోతున్నాడు.అంతే కాకుండా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఈ ఇంటర్వ్యూతో అవుతుంది.బింబిసార సినిమాకు వైవా హర్ష ప్రమోషన్ సక్సెస్ ను తెచ్చి పెట్టింది.
అందుకే మాచర్ల నియోజక వర్గం యొక్క ప్రమోషన్ ను కూడా వైవా హర్ష తో చేయించడం జరిగిందట.ఈ వారం లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
ఈ సినిమా ను నితిన్ హోం బ్యానర్ లో నిర్మించారు.