మా ఇల్లు పగలగొట్టేశారు అంటూ సీరియల్ నటి వీడియో.. నెట్టింట్లో వైరల్!

సోషల్ మీడియా ప్రభావం బాగా ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారారు.ప్రతి ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

 Marina Abraham House Rennovation Video Viral,actress Marina Abraham,america Amma-TeluguStop.com

ఇక సెలబ్రెటీలు మాత్రం తను ఏమి చేసిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటున్నారు.తమ ప్రాజెక్టుల విషయాలనే కాకుండా వాళ్ళు తిరిగిన టూర్ ల ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ ఉంటారు.

ఇక ఈమధ్య బుల్లితెర సెలబ్రెటీలు కూడా మీడియాలో యాక్టివ్ గా మారటమే కాకుండా యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకుని చాలా విషయాలు పంచుకుంటున్నారు.హోమ్ టూర్ వీడియోలు అంటూ షేర్ చేస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఏదైనా నగలు కొన్న, బట్టలు కొన్న, మేకప్ వేసుకున్నా కూడా వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ బుల్లితెర నటి.తమ ఇల్లు పగలగొట్టేశారు అని ఒక వీడియో పంచుకుంది.ఇంతకు ఆ నటి ఎవరో కాదు కొన్ని ఏళ్ల కిందట జీ తెలుగులో ప్రసారమైన అమెరికా అమ్మాయి సీరియల్ అందరికీ గుర్తే ఉంటుంది.

ఇందులో నటించిన హీరోయిన్ సామ్ గురించే మనం మాట్లాడుతుంది. సామ్ అసలు పేరు మెరీనా అబ్రహం.ఈ ముద్దుగుమ్మ గోవా బ్యూటీ.అమెరికా అమ్మాయి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ తర్వాత సిరిసిరిమువ్వలు సీరియల్ లో నటించిన మరింత గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా ప్రేమ అనే సీరియల్ లో కూడా నటించింది.

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర్లో ఉంది.

ఆమె గోవాలో పుట్టగా తన తల్లి కి హైదరాబాద్ ప్రిన్సిపాల్ గా ట్రాన్స్ఫర్ అయింది.దీంతో అప్పటినుంచి హైదరాబాదులోని సెటిల్ అయ్యారు ఈ ఫ్యామిలీ.ఇక మెరీనా తండ్రి చిన్నప్పుడే మరణించారు.

అప్పటినుండి తన తల్లి, తానే కలిసి బ్రతికారు.ఇక ఆ తర్వాత మెరీనా ఇంటర్ పూర్తయ్యాక పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపు రావడంతో ఆ సమయంలో ఒక సినిమాలో అవకాశం వచ్చింది.

ఆ తర్వాత తెలుగులో అమెరికా అమ్మాయి సీరియల్ లో కూడా అవకాశం రావడంతో ఇక్కడ సెటిల్ అయిపోయింది.ఇక ఈమె మరో నటుడు రోహిత్ సహానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక వీరిద్దరూ కలిసి బుల్లితెరపై ఇస్మార్ట్ జోడి అనే షోలో కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే మెరీనా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన ఫ్యామిలీ ఫోటోలను, కొన్ని విషయాలను బాగా షేర్ చేసుకుంటుంది.

యూట్యూబ్లో కూడా తన పేరు మీద ఛానల్ క్రియేట్ చేసుకోగా అందులో కూడా వీడియోలు బాగా షేర్ చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తను మరో వీడియో షేర్ చేసుకోగా అందులో తన ఇల్లుని రేనోవేషన్ చేయటంతో ఆ వీడియో షేర్ చేస్తూ మా ఇల్లు పగలగొట్టేశారు అని పంచుకుంది.దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు నిజంగానే ఇల్లు పగలగొట్టేశారు అన్నట్లు వీడియో చేశావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube