ది.05-08-2022 ఉదయం 11గంటలకు మొగల్రాజపురం లోని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు,Ex.MLA బొండా ఉమామహేశ్వర రావు గారి ఇంటివద్ద బొండా ఉమ గారిచే విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో బొండా ఉమ మాట్లాడుతూ నగరంలో బార్ లైసెన్సు లలో అవకతవకలు జరిగాయి అని, మధ్యపాన నిషేధం చేస్తాం అని చెప్పి రాష్ట్రాన్ని మధ్యంద్ర ప్రదేశ్ గా మార్చేశారు అని అన్నారు.
అధికారంలోకి వచ్చిన ఈ 3ఏళ్లలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లు అయి పడుతుందని కేవలం 15రూపాయలు విలువ చేసే మధ్యని 300రూపాయలకి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు… ప్రభుత్వం మద్యం షాపులలో ఎక్కడా కూడా ఆన్లైన్ ట్రాన్స్సక్షన్ లేకుండా కేవలం కాష్ పేమెంట్ చేసుకుంటూ ఈ నగదు మొత్తం ఎం చేస్తున్నారు అని ప్రశ్నించారు.
ఈనాడు రాష్ట్రంలో మహిళల మంగల్యలతో చలగాటం ఆడుతున్నారు అని అన్నారు… రూరల్ ప్రాంతాలలో బార్ లైసెన్సు వేలంపాట 20లక్షలు ఉన్నది 80లక్షలవరకు పోతే విజయవాడ నగరం లో మాత్రం కేవలం 50లక్షలకు మాత్రమే పాడుకోవడం ఎంటి అని ప్రశ్నించారు.
లంచాలు దందుకోడమే పనిగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని తెలిపారు… త్వరలోనే ఈ మద్యం మాఫియా చిట్టా మొత్తం బయిటికి వస్తుంది అని, అవినీతికి పాల్పడిన ప్రతిఒక్కరూ శిక్ష అనుభవించాలని అన్నారు.ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, నేతలు వీరమాచినేని కిషోర్, సింగం వెంకన్న, అశోక్, పుచ్చ పవన్,రాంబాబు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు….







