తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ ను తెచ్చుకుంది.అంతేకాకుండా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది.
కేవలం తన నటనతో మాత్రమే కాకుండా అందంతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది.మొదటి సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది.
కాగా ప్రస్తుతం శ్రీ లీల చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అర డజను కు పైగా సినిమాలు ఉన్నాయట.అయితే శ్రీ లీల నేడు అంత పాపులారిటీ సంపాదించుకోవడానికి కారణం ఒక వ్యక్తి.
ఆ వ్యక్తి వల్లే ఆమెకు తెలుగులో ఈ రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయి అని అంటుంది.ఆయన మరెవరో కారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.రాఘవేంద్రరావు వల్లే తనకు ఈ రేంజ్ లో హీరోయిన్గా అవకాశాలు వస్తున్నాయి అంటోంది శ్రీ లీల.అయితే తనకు సినిమాలో అవకాశం ఇచ్చి తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్రరావు రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది శ్రీ లీల.ప్రస్తుతం శ్రీ లీల రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

అదేవిధంగా బాలకృష్ణ,మహేష్ బాబు, శర్వానంద్,నితిన్ సినిమాలలో కూడా నటింస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీలకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.శ్రీ లీల చిన్నప్పటి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
ఆ శ్రీ లీల కూచిపూడి డాన్స్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో లాగా కనిపిస్తోంది.మొత్తానికి ఈ ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ఈ ఫోటోని చూసిన అభిమానులు ఇప్పుడే కాదు అప్పట్లోనే శ్రీ లీలా చాలా అందంగా ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే శ్రీ లీల కేవలం తన నటనతో మాత్రమే కాకుండా అందంతో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది.







