యూఎస్ – మెక్సికో సరిహద్దుల్లో దాదాపు 50 మంది సిక్కు శరణార్ధులను అదుపులోకి తీసుకుని వారి తలపాగాలను జప్తు చేశారన్న మానవహక్కుల కార్యకర్తల వాదనలపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.మీడియా నివేదికల ప్రకారం… ఇటీవల దాదాపు 50 మంది సిక్కు వలసదారుల తలపాగాలను బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనలపై యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) కమీషనర్ క్రిస్ మాగ్నస్ బుధవారం స్పందిస్తూ.తాము ఈ తరహా ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తామన్నారు.
జూన్‌లో ఈ మేరకు ఆరోపణలు వచ్చిన తర్వాత వాటిని పరిష్కరించడానికి ఏజెన్సీ వెంటనే చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని మాగ్నస్ తెలిపారు.వలసదారులందరినీ సీబీపీ ఉద్యోగులు గౌరవంగా చూస్తారని ఆయన అన్నారు.
ఈ అంశాన్ని పరిష్కరించడానికి అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు మాగ్నస్ పేర్కొన్నారు.
కాగా.
తలపాగాల వ్యవహారంపై ఈ వారం ప్రారంభంలో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ .సీబీపీ కమీషనర్‌కు లేఖ రాసింది.సిక్కు శరణార్థుల తలపాగాలను జప్తు చేయడం ఆపాలని వారు అందులో అధికారులను కోరారు.ఆశ్రయం కల్పించడం , ప్రాసెసింగ్ సమయంలో సిక్కు వ్యక్తుల నుంచి తలపాగాలను జప్తు చేస్తున్నారని ఏసీఎల్‌యూ సీబీపీ కమీషనర్ మాగ్నస్‌కు లేఖ రాసినట్లు ది హిల్ నివేదించింది.
యుమాకు చెందిన దాదాపు 50 మంది శరణార్ధుల తలపాగాలను యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు లాక్కొన్నారని ఏసీఎల్‌యూ తెలిపింది.అయితే సదరు సిక్కు వలసదారుల జాతీయతలను లేఖలో పేర్కొనలేదు.
ఆరిజోనాకు చెందిన ఏసీఎల్‌యూకి చెందిన న్యాయవాది వెనెస్సా పినెడా అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీతో మాట్లాడుతూ.సిక్కుల తలపాగా వల్ల ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తుతాయనే దాని గురించి సరైన వివరణ ఇవ్వలేదన్నారు.
వలసదారుల వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయడం, వివరణ లేకుండా పారవేయడం ఇందులో భాగమేనని ఆమె వ్యాఖ్యానించారు.అయితే ఏసీఎల్‌యూ తన లేఖలో సిక్కుల తలపాగాలను లాక్కోవడం ఇదే తొలిసారి కాదని వ్యాఖ్యానించింది.2019 మార్చిలో సీబీపీ ఇలాగే వ్యవహరించిందని ఆరోపించింది.







