సాధారణంగా పిల్లులు ఎలుకలు పరిగెత్తాయి.కానీ తాజాగా ఓ ఎలుక పిల్లులను ఉరికించింది.
ఇదంతా బీరు మహత్యం అని చెప్పవచ్చు.అవునండి నిజంగానే ఈ ఎలుక బీరు తాగింది.
అనంతరం దానికి ఎక్కడా లేని ధైర్యం వచ్చింది.ఆ ధైర్యంతో పిల్లి పైకి ఎగురుతూ దానికి హడల్ పుట్టించింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.
వామ్మో బీరు తాగితే మనుషులే కాదు ఎలుకలు కూడా ఇలా రెచ్చిపోతాయా అని మరికొందరు నోరెళ్లబెడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేయగానే.
మనకి ఓ ఇంట్లోని ఓ గ్లాస్‌లో బీర్ పోసి ఉండటం గమనించవచ్చు.ఆ గ్లాస్ వద్దకు ఒక ఎలుక వస్తుంది.
అనంతరం అది గ్లాస్‌పైన తన ముందు కాళ్ళు వుంచి బీరు తాగింది.అది గ్లాస్‌లోని బీర్‌ను కొంచెం కొంచెంగా తాగుతూ చాలా వరకు ఖాళీ చేసింది.
ఆ తర్వాత బీరు తాగిన ధైర్యం రావడంతో అది ఒక పెద్ద పిల్లి పై ఎగురుతూ బీభత్సం సృష్టించింది.అయితే ఎలుక ఇలా రెచ్చిపోవడంతో పిల్లి జడుసుకుంది.అనంతరం ఈ ఎలుక ఒక పిల్లి తోకను కరిచింది.ఆ తర్వాత దానిని ఉరికిస్తూ ఒక రౌడీ లాగా బిహేవ్ చేసింది.ఇది చూస్తూ ఉంటే కార్టూన్ నెట్వర్క్ లో వచ్చే టామ్ అండ్ జెర్రీ షోలాగా అనిపించింది.
ఈ ఫన్నీ వీడియోను ’18plusguyy’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది.
అలా షేర్ చేయగానే ఇలా ఇది వైరల్ గా మారింది.ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.
దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.







