వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కీలక నాయకులు , పార్టీ కార్యకర్తలు ఇలా అంతా నిత్యం జనాల్లో ఉండేలా, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలు పొందిన లబ్ధి ఇలా అనేక అంశాలను జనాలకు పూర్తిగా వివరించే విధంగా జగన్ గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఇందులో ప్రభుత్వ అధికారులను భాగస్వామ్యం చేశారు.
దీని ద్వారా జనాల్లో ఏ ఏ విషయాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది అనేది తెలుసుకోవడంతో పాటు, జనాలకు మరింత చేరువ అయ్యేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అనేది జగన్ ఆలోచన.
అంతేకాదు ఈ కార్యక్రమం పైన ఎమ్మెల్యేల తీరుపైనా జగన్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు.
గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో జనాల నుంచి ఎమ్మెల్యేలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఏ ఏ విషయాల్లో ప్రజలు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తే గెలుస్తారో లేదో ? వాస్తవ పరిస్థితి ఏమిటి ఇలా అనేక అంశాలపై సర్వేలు చేయిస్తున్నారట.తాజాగా చాలామంది ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రంగానే ఉండడంతో.కొంతమంది ఎన్నికల్లో విజయం సాధిస్తారని , రిపోర్ట్ అందగా, ఓ 20 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే ఛాన్స్ లేదని తేలిందట.

సర్వేలో మీ పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవడం, నియోజకవర్గ ప్రజలలోను వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని తేలడం తో సదరు ఎమ్మెల్యే లను స్వయంగా పిలిచి మరీ జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇక మరికొంతమంది ఎమ్మెల్యే లకు పనితీరు మార్చుకుని ప్రజా బలం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారట.ప్రస్తుతం వైసిపి ఎమ్మెల్యేలు ఈ సర్వే నివేదికల అంశం పైనే జోరుగా చర్చించుకుంటున్నారట.ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కు జగన్ నుంచి పిలుపు వస్తుందో అనే టెన్షన్ లో ఉన్నారట.







