శేఖర్ కమ్ముల.ఈ పేరు ని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.
ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కొన్నే అయినా అవి వేటికవే అన్నట్లుగా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.ముఖ్యంగా ఫిదా సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
హీరోయిన్ సాయి పల్లవి ని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత శేఖర్ కమ్ముల కే దక్కుతుంది.ఆ సినిమా కి ఏకంగా వంద కోట్ల వసూళ్లు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.
ఇప్పుడు శేఖర్ కమ్ముల ఏ సినిమా చేస్తున్నాడంటే చెప్పలేని పరిస్థితి ఉంది.మొన్నటి వరకు శేఖర్ కమ్ముల ఒక సినిమా ని తమిళ్ హీరో ధనుష్ తో చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి.
ఆ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది.
షూటింగ్ ప్రారంభం అవుతుంది అనుకుంటుండగా ఆ సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం తో అసలు ఏం జరిగిందో తెలియక శేఖర్ కమ్ముల అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.
తమిళ హీరో ధనుష్ తెలుగులో మొదటగా చేయాల్సినది శేఖర్ కమ్ముల దర్శకత్వం లోనే.కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కాకుండా వెంకీ అట్లూరి దర్శకత్వం లో నటిస్తున్నాడు.

ఆ తర్వాత అయినా శేఖర్ కమ్ముల సినిమా లో ధనుష్ నటిస్తాడా అంటే క్లారిటీ లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అసలు ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం కచ్చితంగా ధనుష్ అంటూ కొందరు కమ్ముల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ధనుష్ ఓవర్ యాక్షన్ వల్లే సినిమా ఆలస్యమైందని శేఖర్ కమ్ముల అభిమానులు తిట్టిపోస్తున్నారు.అసలు సినిమా ఆలస్యం కు కారణమేంటి? ఇంతకు సినిమా ఉందా? లేదా? అనేది తెలియాలంటే శేఖర్ కమ్ముల నోరు తెరవాల్సిందే.







