ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా రంగ రంగ వైభవంగా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు ఆ మధ్య జరగడంతో విడుదల తేది దగ్గర ఉంటుందని అంతా భావించారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేది ఇప్పట్లో లేదని తెలుస్తోంది.మొన్నటి వరకు సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల అవుతుందని అంతా భావించారు కానీ సెప్టెంబర్లో సినిమా ఉండక పోవచ్చని.
మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా తో మాట్లాడుతూ ఈ సినిమా బాగా వచ్చిందని తప్పకుండా మీ అందరి దృష్టిని ఆకర్షించడం తో పాటు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
మంచి సినిమాలు మంచి సమయంలో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తున్నామని వారు అంటున్నారు.సినిమా విడుదల తేదీ ని త్వరగా ప్రకటించండి అంటూ మెగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండ పొలం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా లో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా, అర్జున్ రెడ్డి ని తమిళంలో తెరకెక్కించిన గిరీశాయ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా తో వైష్ణవ్ తేజ్ మరో కమర్షియల్ సక్సెస్ ను తన ఖాతా లో వేసుకోవడం ఖాయమంటూ మెగా అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.







