నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరక్షన్ లో వస్తున్న సినిమా బింబిసార.సినిమా ట్రైలర్ అంచనాలు పెంచగా సినిమాతో కెరియర్ లో ఫస్ట్ టైం కళ్యాణ్ రామ్ చారిత్రక కథతో వస్తున్నారు.
బాహుబలి సినిమా తర్వాత తెలుగులో ఇలాంటి నేపథ్యంతో వస్తున్న సినిమా బింబిసార మాత్రమే అని చెప్పొచ్చు.సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే అంచనాలకు తగినట్టుగానే ఉండేలా ఉంది.
ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమా చూసిన ఆల్రెడీ కొంతమంది సినిమాపై వారి రివ్యూ ఇచ్చారట.
తప్పకుండా బింబిసార నందమూరి ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా ఉంటుందని అంటున్నారు.
కళ్యాణ్ రామ్ ఏ సినిమా ప్రమోషన్స్ లో ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడటలేదు.
బింబిసార తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అంటున్నారు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించారు.
ట్రైలర్ చూస్తే సినిమాతో కళ్యాణ్ రామ్ నటుడిగా మరో మెట్టు ఎక్కేలా ఉన్నారని చెప్పొచ్చు.కళ్యాణ్ రామ్ తో పాటుగా ఈ సినిమాలో హీరోయిన్స్ కేథరిన్, సంయుక్త మీనన్ లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉన్నారు.
ఆల్రెడీ భీమ్లా నాయక్ సినిమాతో సంయుక్త మీనన్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది.ఇప్పుడు బింబిసారతో ఆమె మరింత పాపులర్ అవనుంది.
ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా షూటింగ్ టైం లోనే డైరక్టర్ వశిష్ట బింబిసార కథ గురించి చెప్పారని.కథ నచ్చడంతో మరో మాట మాట్లాడకుండా సినిమా ఓకే చేశారట కళ్యాణ్ రామ్.
ఈ సినిమా విషయంలో చాలా అద్భుతాలే జరిగాయని అవి తెర మీద చూడాలని అంటున్నారు కళ్యాణ్ రామ్.సినిమా కోసం అందరు చాలా బాగా కష్టపడ్డారని తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు.
ఈ సినిమా కేవలం ఒక పార్ట్ తో కాదు బింబిసారకి కొనసాగింపు ఉంటుందని అంటున్నారు కళ్యాణ్ రామ్.







