నీ కన్నా ఏది ఎక్కువ కాదు.. మహేష్-నమ్రత జంట అన్యోన్యత ఇలా..

సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు.అయితే వారిలో ఎక్కువ మంది వివిధ కారణాలతో పట్టుమని పదేళ్లు కూడా కలిసి బ్రతక కుండానే విడిపోయిన వారే ఎక్కువ.

 Mahesh And Namratha Latest Pics Goes Viral Details, Mahesh Babu, Sarkaru Vaari P-TeluguStop.com

చిన్న చిన్న వాటికే విడాకుల వరకు వెళ్లిన సెలెబ్రిటీలు చాలా మందే ఉండగా వీరందరూ కూడా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతుల నుండి చాలానే నేర్చుకోవాలి అంటున్నారు ఫ్యాన్స్.

వారి అభిమాన హీరో అయినా మహేష్ బాబు, నమ్రత దంపతుల అన్యోన్యత గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు.

ఇదంతా ఎందుకు వచ్చింది అంటే.మహేష్ బాబు భార్య నమ్రత శిరోడ్కర్ తాజాగా మహేష్ తో కలిసి ఉన్న బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలను చుసిన ఆయన ఫ్యాన్స్ లైక్స్ తో మోత మోగిస్తున్నారు.

మహేష్ బాబు చిన్న పిల్లాడిలా మారిన వేళ తన భార్యను తల్లిని కౌగిలించుకున్న కొడుకులా చుట్టుకుని ఉన్న ఫోటోలను చూసి మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.

ఎంత అన్యోన్యత ఉంది వీరి మధ్య అంటూ చర్చించు కుంటున్నారు.పెళ్లి అయ్యి ఇన్ని ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికి ఇంత అన్యోన్యంగా ఉండడం నిజంగా గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు.

నమ్రత ఈ ఫోటోలను షేర్ చేస్తూ నీ కంటే ఎక్కవ ఎవ్వరు కాదు.ఏది కాదు అంటూ చెప్పాకనే చెప్పింది.ఇది ఇలా ఉండగా ఇటీవలే మహేష్ నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంది.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube