పోగొట్టుకున్న బ్యాగును బాధితుడికి అప్పగించిన బ్లూ కోల్డ్స్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి బ్యాగ్ అప్పగించిన కానిస్టేబుల్ కు క్యాష్ రివార్డ్ అందజేసిన పోలీస్ కమిషనర్ ఖమ్మం ఆర్బన్ మండలం,అల్లిపురం గ్రామానికి చెందిన చెరుకూరి ఈశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా ఈరోజు వైద్యం పరిక్షలకు వెళ్లి ఆనంతరం ఖమ్మం నుంచి అల్లిపురం గ్రామానికి వెళ్తుండగా అతనికి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ మార్గం మద్యలో ఎక్కడో పడిపోయిందని కొద్దిసేపటికి గ్రహించిన బాధితుడు వెంటనే డయల్ 100 కు సమాచారం అందజేశారు.
డయల్ 100 కాల్ సమాచారం అందుకున్న ఆర్బన్ పోలీస్ స్టేషన్ బ్లూ కోల్డ్స్ పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు బాధితుడుతో మాట్లాడి వివరాలు తీసుకొని అతను ప్రయాణించిన మార్గంలో వెతికిబ్యాగ్ ను గుర్తించారు.
అందులో విలువైన భూమి పత్రాలు, ఆరు గ్రామాల బంగారం పుస్తె, రెండు వేల నగదు వున్నట్లు గుర్తించి బాధితుడికి అప్పగించారు.ఒక వ్యక్తి పోగొట్టుకున్న బ్యాగును సకాలంలో స్పందించి బ్యాగ్ అప్పగించిన కానిస్టేబుల్ కు పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ క్యాష్ రివార్డ్ అందజేసి అభినందించారు.పోగొట్టుకున్న బ్యాగును తిరిగి ఇచ్చిన కానిస్టేబుల్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.







