'లాల్ సింగ్ చద్దా'తో ఇద్దరు లెజెండ్స్.. వ్యూహాత్మకంగా సాగుతున్న ప్రొమోషన్స్!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మన తెలుగు స్టార్ హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున లతో మంచి స్నేహబంధం ఉన్న విషయం తెలిసిందే.ఎన్నో ఏళ్లుగా వీరు స్నేహితులుగా కొనసాగుతున్నారు.

 Aamir Fun With Chiru Nag Video Viral On Social Media , Kareena Kapoor , Aamir Kh-TeluguStop.com

ఇక వీరి స్నేహం, వీరి మధ్య ఎంత బాండింగ్ ఉందో లాల్ సింగ్ చద్దా ద్వారా బయట పడుతుంది.ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ గత కొన్ని రోజులుగా ఇక్కడే సెటిల్ అయ్యాడు.

అమీర్ ఖాన్ తన స్నేహితులను ఈ సినిమా కోసం రంగంలోకి తాజాగా ఈ ముగ్గురు లెజెండ్స్ కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.నాగార్జున హోస్ట్ గా సాగిన ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి, అమీర్ ఖాన్ తో పాటు నాగ చైతన్య కూడా పాల్గొన్నాడు.

ఈ ముగ్గురు లెజెండ్స్ మధ్య నాగ చైతన్య పాల్గొనడం అతడి అదృష్టం అనే చెప్పాలి.

ఈ ఇంటర్వ్యూకు సంబందించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ ప్రోమో వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.దీంతో ఫుల్ ఇంటర్వ్యూ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా సినిమాను అద్వైత్ డైరెక్ట్ చేసాడు.ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటించాడు.

ఇది తనకు మొదటి డెబ్యూ సినిమా.ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో వరుస ప్రొమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు.

ఇక ఈ సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పణలో విడుదల చేస్తున్నారు.దీంతో ఈ ప్రొమోషన్స్ లో చిరు కూడా భాగం అయ్యారు.ఇక బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నారు.ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా హిట్ అందుకోలేదు.

ఇదే క్రమంలో సౌత్ సినిమాలు అక్కడ వందల కోట్లు వసూలు చేస్తుండడం అక్కడి హీరోలకు మింగుడు పడని విషయంగా మారింది.దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అక్కడి వారంతా కోరుకుంటున్నారు.

చూడాలి ఏం జరుగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube