ప్రభాస్ కు రాధేశ్యామ్.. చిరంజీవికి ఆచార్య.. రవితేజకు రామారావు ఆన్ డ్యూటీ!

ఎంత పెద్ద స్టార్ హీరో నటించినా కథ, కథనం ఆకట్టుకునే విధంగా లేని పక్షంలో సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఈ ఏడాది విడుదలైన పలు సినిమాలు బడ్జెట్ కలెక్షన్లతో పోల్చి చూస్తే ఆయా స్టార్ హీరోల సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలవడం గమనార్హం.

 Prabhas Chiranjeevi Raviteja Movie Results Details Here Goes Viral, Acharya, Pra-TeluguStop.com

రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ మార్చి నెల 11వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

రెండుసార్లు రిలీజ్ డేట్లను మార్చుకున్న ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్లను సాధించడంలో ఫెయిలైంది.

ప్రభాస్ కెరీర్ లో గతంలో ఏ సినిమాకు రాధేశ్యామ్ సినిమా స్థాయిలో నష్టాలు రాలేదు.మార్చి రెండోవారంలో రాధేశ్యామ్ సినిమా విడుదల కాగా ఏప్రిల్ చివరి వారంలో ఆచార్య సినిమా విడుదలైంది.

చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.

దాదాపుగా మూడున్నర సంవత్సరాల పాటు ఆచార్య మూవీ షూటింగ్ జరుపుకోవడంతో ఈ సినిమాపై వడ్డీల భారమే 50 కోట్ల రూపాయలు పడిందని బోగట్టా.

అయితే ఆచార్య వడ్డీలకు సరిపడా కలెక్షన్లు కూడా రాలేదని తెలుస్తోంది.ఈ సినిమా బిజినెస్ వ్యవహరాలలో జోక్యం చేసుకోవడంతో కొరటాల శివ ఆర్థికంగా కోట్ల రూపాయలు నష్టపోయారని సమాచారం అందుతోంది.

Telugu Acharya, Prabhas, Radheshyam, Ramarao Duty-Movie

రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తో ప్రదర్శితమవుతోంది.వీకెండ్ లో కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేవని తెలుస్తోంది.రవితేజ రెమ్యునరేషన్ పై కాకుండా కంటెంట్ ఉన్న కథలపై దృష్టి పెట్టాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.మాస్ మహారాజ్ రవితేజ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube