నందమూరి అన్నదమ్ములు చాలా రోజుల తర్వాత స్టేజ్ పంచుకున్నారు.కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి సాన్నిహిత్యం తో ఉంటారు.
వీరిద్దరి మధ్య అనుబంధం అందరికి తెలిసిందే.అన్న కళ్యాణ్ రామ్ కోసం తమ్ముడు తారక రామారావు కదిలి వచ్చాడు.
కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ సినిమా బింబిసార.
కళ్యాణ్ రామ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కోసం తనవంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ విచ్చేసారు.హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జులై 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్ తో అదరగొట్టారు.
ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసింది.అయితే కళ్యాణ్ రామ్ ఒక్కడితో ఇది మరింత హైప్ తెచ్చుకోవడం కష్టమే.దీంతో ఈ సినిమా కోసం తన తమ్ముడు ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాడు కళ్యాణ్ రామ్.తారక్ చాలా రోజుల తర్వాత బయట కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా అక్కడికి చేరుకున్నారు.

ఎన్టీఆర్ ను లైవ్ లో చూసేందుకు ఫ్యాన్స్ అధిక మొత్తంలో విచ్చేసారు.అంతా సాఫీగా సాగింది అని అనుకునే లోపే ఈ ఈవెంట్ నుండి షాకింగ్ న్యూస్ ఒకటి టీమ్ ప్రకటించడంతో అందరు షాక్ అవుతున్నారు.ఈ ఈవెంట్ కు వెళ్లిన ఎన్టీఆర్ అభిమాని అయినా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాయి రామ్ ప్రమాదవుసాత్తు మరణించినట్టు అధికారికంగా తెలుపుతూ.వారి కుటుంబానికి అండగా ఉంటామని.
ఆయనకు వారి సానుభూతి తెలిపారు.ఈ విషయం తెలిసి అందరు బాధపడుతున్నారు.
ఈవెంట్ లో ఎలాంటి పొరపాటు లేకుండా చక్కగా జరిగింది అనుకునే లోపే ఇలా జరగడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సైతం కదిలించింది.
ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.







