తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటిస్తున్నారు.అయితే, నాలుగు రోజుల క్రితం హస్తిన వెళ్లిన ఆయన ఎక్కడ ఏం చేశారో ఎవరికి తెలియదు.
కేంద్ర మంత్రులను గానీ అధికారులను కానీ కలిసినట్లు సమచారం లేదు.రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారని వార్తలు వచ్చినా… ఆయన రాష్ట్రపతి భవన్ కు వెళ్లలేదు.
జాతీయ రాజకీయాల్లో భాగంగా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతారని టీఆర్ఎస్ వర్గాలు లీకులు ఇచ్చినా అలాంటి మీటింగ్స్ కూడా జరగలేదు.అసలు విషయం అక్కడికి వెళ్లింది కొత్త అప్పుల కోసమే… కానీ కేంద్రం నుంచి సరైన సిగ్నల్ రాకపోవడంతోనే రాష్ట్రానికి వచ్చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో ఓవైపు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు, కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు.
రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతుంటే… కేసీఆర్ నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించినా… గులాబీనేతలు సమాధానం ఇవ్వడానికి కూడా రెడీగా లేరు.
గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ ను వరదలు వణికిస్తున్నాయి.జంట జలాశయాలకు ఊహించని వరద రావడంతో మూసీ ఉప్పొంగింది.
మూసీ పరివాహాక ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో గడుపుతున్నారు.ఇలాంటి పరిస్థితులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటించడంతో విమర్శలు వస్తున్నాయి.
వరద పరిస్థితులను పర్యవేక్షించాల్సిన సీఎం కేసీఆర్ ఢిల్లీలో నాలుగు రోజుల పాటు ఉండి ఏం చేశారన్నది ఆసక్తిగా మారింది.జాతీయ రాజకీయాలు కాకుండా తెలంగాణ అప్పుల పరిస్థితిపై హస్తినలో కేసీఆర్ కసరత్తు చేశారని సమాచారం.
ఇంతకి కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారంటే… అప్పుల కోసం ప్రయత్నించారని…కొత్తగా రాష్ట్రానికి అప్పు పుట్టించుకుని…

ప్రస్తుత ఆర్థిక గడ్డు పరిస్థితి నుంచి ఎలా బయటపడాలన్న అంశంపై రాష్ట్రానికి చెందిన అధికారులతోనే చర్చించినట్లు సమాచారం.అప్పుల సేకరణపై కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.ఢిల్లీ వెళ్లే ముందు … పర్యటన వివరాలను టీఆర్ఎస్ నేతలు లీక్ లు ఇచ్చారు.అధికారికంగా మాత్రం ఏ ప్రకటనా వెలువడలేదు.కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వంగా కలుస్తారని.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారని లీక్ లొచ్చినా… ఎవరినీ కలువలేదు.అమిత్ షాను వరదల వల్ల కలిగిన నష్టాన్ని వివరిస్తారని అధికారులు తెలిపినా.ఆ పనీ జరగలేదు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి వరదల బీభత్సం గురించి వివరిస్తారని ప్రచారం కూడా జరిగింది.దీనితో పెండింగు నిధుల పై కూడా చర్చిస్తారని అనుకున్నారు.
ఇన్ని రకాలుగా ప్రచారం జరిగినా ఢిల్లీలో ఏదీ జరగలేదని సమాచారం.







