బుల్లితెరపై దుమ్ములేపిన పెళ్లి సందD.. రేటింగ్ ఎంతంటే?

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా శ్రీ లీలా హీరోయిన్ గా గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమా ప్రముఖ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో తెరకెక్కింది.

 Pellisandad Film Trp Ratings Know Details Inside-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మొదటిసారిగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించారు.అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లను రాబట్ట లేకపోయింది.

ఇలా కలెక్షన్ల విషయంలో విఫలమైన ఈ సినిమా అనంతరం జీ5 లో స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను సందడి చేసింది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై ప్రసారమైంది.

ఈ సినిమా థియేటర్లోనూ డిజిటల్ మీడియాలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.తాజాగా ఈ ప్రీమియర్ షో కి సంబంధించిన రేటింగ్ రావడంతో ఈ రేటింగ్ చూస్తే మాత్రం ఈ సినిమా బుల్లితెరపై దుమ్ములేపిందని చెప్పాలి.ఆర్కె ఫిలిం అసోసియేషన్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై తెరికెక్కిన ఈ సినిమా టెలివిజన్ లో ప్రసారమవుతు ఏకంగా 8.62 రేటింగ్ సంపాదించుకుందని తెలుస్తుంది.

Telugu Raghavendra Rao, Roshan, Srikanth, Pellisandad, Pellisandad Trp, Sree Lee

థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాకు బుల్లితెరపై ఈ విధమైనటువంటి రేటింగ్ రావడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక నటి శ్రీ లీలకు ఈ సినిమా డెబ్యూ మూవీ అయినప్పటికీ ఈ సినిమాలో ఈమె నటనకు ఫిదా అయ్యారు.ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు కన్నడ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇండస్ట్రీలో యంగ్ హీరోలు అందరూ చూపు ఈ హీరోయిన్ పైనే ఉందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube