గజరాజులకు కోపం ఎక్కువ.వాటి కోపం చాలా ప్రమాదకరం.
అంతెత్తు ఏనుగు మీదకు కోపంగా దూసుకువస్తుంటే గుండెలు జారుతాయి.తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఏనుగులు దాడుల గురించిన వార్తలు తరచూ వింటూనే ఉంటాం.
అడవుల నుండి పొలాల్లోకి వచ్చి తోటల్ని నాశనం చేస్తాయి.ఏనుగుల గుంపు వచ్చినప్పుడు పటాసులు పేల్చి, డప్పులు వాయించి వాటిని బెదరగొట్టే ప్రయత్నం చేస్తుంటారు.
ఒక్కో సారి గ్రామస్థుల ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి.కానీ కొన్ని సందర్భాల్లో ఏనుగుల కోపం ముందు గ్రామస్థులు చేసే ఏ పని కూడా ఫలితాన్ని ఇవ్వదు.
ఇక్కడ ఓ వీడియోలో ఏనుగు కోపంగా ఇద్దరు వ్యక్తుల మీదకు దూసుకువస్తుంది.వాళ్లు మాత్రం దానికి ఎదురుగా ఏ భయం లేకుండా నిలబడి దాని వైపే చూస్తుంటారు.
వాళ్లు పరిగెత్తకపోవడం, భయపడకపోవడం గమనించిన గజరాజు వారిని ఏమీ చేయకుండా వెనక్కి తిరిగి పరుగు పెడుతుంది.ఈ వీడియో కింద భయపడకుండా, ఆందోళన చెందకుండా ఉండటం అనేది సరైన రక్షణ విధానం అని క్యాప్షన్ ఇచ్చారు.
కొందరు మాత్రం ఆ ఏనుగు వారిని చూసి భయపడి పారి పోలేదని.ఆ వ్యక్తి చేతుల్లో రైఫిల్ చూసి పారి పోయిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.అసలు ఏనుగు ఎందుకు తిరిగి పారి పోయింది.వాళ్లు భయపడకుండా ఉండటం చూసి పారిపోయిందా.
లేదా వారి వద్ద ఉన్న రైఫిల్ చూసి పరిగెత్తిందా మీరూ ఆ వీడియో చూసి చెప్పండి.