'గాడ్ ఫాథర్' నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసిన డైరెక్టర్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

 Godfather Director Give Interesting Updates, Prabhu Deva , Megastar Chiranjeevi,-TeluguStop.com

ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా ముగింపు దశకు చేరుకోవడంతో పూర్తిగా స్టార్స్ తో నింపేస్తున్నారు.మెగా స్టార్ చిరంజీవి అంటేనే ఒక రేంజ్ లో అంచనాలు పెరిగి పోతాయి.

ఇప్పుడు చిరంజీవి కి తోడుగా సల్మాన్ ఖాన్, సునీల్, నయనతార, పూరీ జగన్నాథ్, అనసూయ ఇలా ఇంత మంది స్టార్స్ ఈ సినిమాలో కనిపించడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.

ఈ క్రమంలోనే తాజాగా మరొక క్రేజీ అప్డేట్ ను డైరెక్టర్ మోహన్ రాజా బయట పెట్టినట్టు సమాచారం.

ప్రెసెంట్ ఈ సినిమాలో చిరంజీవి స్పెషల్ క్రేజీ సాంగ్ షూట్ చేస్తున్నామని ఆ సాంగ్ ను ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కొరియోగ్రఫి చేస్తున్నాడని తెలిపాడు.మరి చిరు డాన్స్ అంటేనే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.

మరి అలాంటి వ్యక్తికి ఒక ప్రభుదేవా తోడయ్యాడంటే ఎలాంటి స్టెప్స్ వేయిస్తాడో అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు.చూడాలి ఈ క్రేజీ సాంగ్ ఎలా ఉండబోతుందో.

Telugu God, Chiranjeevi, Mohan Raja, Prabhu Deva, Salman Khan-Movie

ఇది ఇలా ఉండగా ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.అందుకే ఎలాగైనా ఆచార్యను మరిపించే హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ను సంతోష పరచాలని మెగాస్టార్ కోరుకుంటున్నాడు.మరి గాడ్ ఫాథర్ తో ఆ కోరిక తీరుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube