పుష్ప 2 స్క్రిప్ట్‌ వర్క్‌.... బాబోయ్ నా స్థాయి అది కాదన్న బుచ్చిబాబు

అల్లు అర్జున్‌ హీరోగా పుష్ప సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.సుకుమార్‌ దర్శకత్వం లో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప కు సంబంధించిన సీక్వెల్‌ పనిలో సుకుమార్ ఉన్నాడు.

 Uppena Director Buchibabu Clarity About Pushpa 2 Work With Sukumar, Buchibabi, F-TeluguStop.com

పుష్ప సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో దర్శకుడు సుకుమార్‌ చాలా సమయం తీసుకుని సీక్వెల్‌ స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న పుష్ప 2 సినిమా యొక్క స్క్రిప్ట్‌ వర్క్ లో దర్శడుకు బుచ్చి బాబు కూడా పాల్గొన్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

బుచ్చి బాబు యొక్క ఫోటో లు సోషల్‌ మీడియా లో వైరల్‌ అయ్యాయి.గురువు యొక్క సినిమా కు ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సపోర్ట్‌ అన్నట్లుగా సోషల్‌ మీడియా లో రకరకాలుగా ప్రచారం జరిగింది.

పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం నేపథ్యం లో ఆ ఫోటో లపై దర్శకుడు బుచ్చి బాబు క్లారిటీ ఇచ్చాడు.

తన గురువు ముందు కూర్చుని ఆయన సినిమా గురించి చర్చలు జరిపేంత స్థాయి నాది కాదు.

నా తర్వాత సినిమా యొక్క కథ గురించి గురువు గారి తో చర్చించాను.అంతే తప్ప ఆ ఫోటో లు పుష్ప 2 యొక్క సిట్టింగ్స్ కాదని ఆయన చెప్పుకొచ్చాడు.

బుచ్చి బాబు తదుపరి సినిమా ను ఎన్టీఆర్‌ తో చేయాల్సి ఉంది.స్క్రిప్ట్ వర్క్‌ పూర్తి చేసి చాలా రోజులు అయ్యిందని.ఎన్టీఆర్‌ డేట్ల కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.కాని తాజాగా సుకుమార్‌ తో స్క్రిప్ట్ చర్చలు జరిపాను.

తన సినిమా కు సంబంధించిన వర్క్ అంటూ బుచ్చి బాబు చెప్పడంతో ఆయన తర్వాత సినిమా ఎవరితో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అసలు బుచ్చి బాబు తన సూపర్ హిట్‌ ఉప్పెన క్రేజ్ ను ఉపయోగించుకోవడం లో విఫలం అయ్యాడు అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube