మన చుట్టూ జరుగుతున్న ఎన్నో విషయాలను మనం పట్టించుకోము.కానీ మనలో కొంతమంది కొన్ని విషయాలపట్ల నిత్యాన్వేషణ చేస్తూ వుంటారు.
తత్ఫలితంగా వారు జ్ఞానాన్ని ఆర్జిస్తూ వుంటారు. ఆకాశంలో విమానాలు ఎగురుతున్నపుడు కిందనుండి చాలా కేజ్రీగా చూస్తూ ఉంటాము.
విమానాన్ని నడపడం అంటే సాధారణ విషయం కాదు.ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ప్రయాణం క్షేమంగా జరగదు.
పైలట్లకు ఇది ఎంతో బాధ్యతతో కూడిన పని.అందుకే ఈ జాబ్ చేసేవారు ఎంతో నిబద్ధతను కలిగి వుంటారు.ఇక విమానం నడిచే అంశానికి సంబంధించి కొంతమందిని ఎన్నో సందేహాలు వెంటాడుతు ఉంటాయి.
అందులో ఒకటి, అత్యవసర పరిస్థితులలో విమానానికి బ్రేక్ ఎలా వేస్తారు? అని.విమానం బ్రేక్ అనేది కాస్త ఆసక్తిని కలిగించే అంశం.గాల్లో ఏ విధంగా విమానం స్లో అవుతుంది అనేది చాలా మందికి తెలియదు.
మాములుగా రన్ వే పై అయితే గనుక టైర్ లపై బ్రేక్ లను ఉపయోగించి విమానం వేగాన్ని తగ్గించడం జరుగుతుంది.విమానం వెనుక టైర్లలో డిస్క్ బ్రేక్ అనేది చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.
ఇక గాలిలో ఎగురుతున్నప్పుడు, ఇంజిన్ శక్తిని పెంచడం లేదంటే తగ్గించడం ద్వారా విమానం వేగాన్ని కంట్రోల్ చేస్తారు.

ఈ రకంగా విమానం స్పీడ్ ని కంట్రోల్ చేస్తారు.అదే విధంగా ఇంజిన్లోకి ఇంధన ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా కూడా ఇంజన్ వేగాన్ని, అది ఎంత గాలిని వెనక్కి నెట్టగలదనే అంశాలను కంట్రోల్ చేయవచ్చు.జెట్ ఇంజన్లు వాటి శక్తిని కంట్రోల్ చేయడానికి కాస్త కష్టమైన పద్దతిలో వెళ్తాయి.
విమానం వేగాన్ని నియంత్రించడానికి మరొక ముఖ్యమైన భాగం ఫ్లాప్స్.వీటిని రెక్కలతో లింక్ చేస్తారు.
జతచేయబడతాయి. ఫ్లాప్‌లను వర్తింపజేయడం ద్వారా రెక్క ఆకారాన్ని మార్చవచ్చు, దీనివల్ల కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.
పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటారు.