సౌత్ నార్త్ అనే తేడా లేకుండా వరుస బాలీవుడ్ చిత్రాలతోనూ అలాగే సౌత్ ఇండస్ట్రీలో పలు భాషా చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మొదటిసారిగా ఫ్యాషన్ వీక్ లో పాల్గొని సందడి చేశారు.
ఈ ఫ్యాషన్ వీక్ లో భాగంగా ఈమె ఎరుపు రంగు లెహంగా ధరించి చిరునవ్వులు చిందిస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫ్యాషన్ వీక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈ ఫ్యాషన్ వీక్ లో భాగంగా తను నడవడానికి తనకు ఎంతో సహాయం చేసిన వ్యక్తికి రష్మిక సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ ఢిల్లీలో మొదటిసారి ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్నాను.నేను ప్రో మోడల్ లాగా నడవడానికి ప్రయత్నం చేశాను కానీ అది కుదరడం లేదు.
నేను కేవలం నవ్వగలను మాత్రమే అది నా వ్యక్తిత్వం అంటూ చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఆవేదికపై నేను మోడల్ గా నడవడం కోసం ఎంతో సహాయం చేసిన వరుణ్ కి థాంక్స్ అని అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఇది ఎప్పటికీ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.మనం కలిసి మరిన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా రష్మిక వరుణ్ అనే వ్యక్తికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అరడజనులకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.