కేసీఆర్ ను ఇక్క‌డికే ప‌రిమితం చేసేలా బీజేపీ ప్లాన్..?

బీజేపీ త‌న ప్రాభ‌ల్యాన్ని విస్త‌రిస్తోంది.సౌత్ లో ముఖ్యంగా తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్టింది.

 Bjp's Plan Against Cm Kcr..?, Modi, Amit Shah, Kcr, Bandi Sanjay, Bjp, Trs, Cong-TeluguStop.com

ఇక రాష్ట్రంలో బ‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో కేంద్రం పెద్ద‌లు మ‌రింత దృష్టి సారించారు.స్టేట్ నేత‌ల‌కు ప‌లు బాధ్య‌త‌లు అప్ప‌గించి పావులు క‌దుపుతున్నారు.

ఇటీవ‌ల జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు సైతం హైద‌రాబాద్ లో పెట్టి నేత‌లందినీ ఇక్క‌డ ప‌ర్య‌టిచేలా చేశారు.ఇక కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వ‌చ్చిపోతూనే ఉన్నారు.

అయితే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి జాతీయ స్థాయిలో మోడీని నిలువ‌రించ‌డానికి ప్ర‌య‌త్నించినా ప్ర‌స్తుతం వెన‌క్కి త‌గ్గారు.అయితే కేసీఆర్ ను ఢిల్లీ రాకుండా నిలువ‌రించాలంటే రాష్ట్రంలో ఆయ‌న‌కు ఊపిరి ఆడ‌నివ్వ‌కుండా ఉండేలా వ్యూహాలు ప‌న్నాల‌ని బీజేపీ పెద్ద‌లు ప‌క్కా ప్లాన్ అమ‌లు చేస్తున్నారు.

అందులో భాగంగానే అమిత్ షా నెలకు మూడురోజులపాటు పర్యటించడమే కాదు టీఆర్ఎస్ నుంచి భారీగా బీజేపీలోకి చేరికలను ప్రోత్స‌హిస్తున్నారు.కేసిఆర్ కు చెక్ పెట్టేలా ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఇక‌నుంచి నెల‌కు రెండు నుంచి మూడు రోజులపాటు అమిత్ షా ప‌ర్య‌టించ‌బోతున్నారని అంటున్నారు.ఇక వ‌చ్చే నెల‌లో పార్టీ స్టే ట్ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర పునఃప్రారంభిచ‌బోతున్నారు.

అయితే ఈ స‌భ ముగింపున‌కు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజ‌రు కాబోతున్నారు.ఈ క్ర‌మంలో మ‌రిన్ని చేరిక‌లు ఉంటాయ‌ని చెబుతున్నారు.

అసంతృప్తి నేత‌ల‌తో చ‌ర్చిస్తార‌నే టాక్ వినిపిస్తోంది.

Telugu Amit Shah, Bandi Sanjay, Bjp Trs, Bjps Cm Kcr, Congress, Kcr National, Mo

చేరిక‌లు ప‌క్కా ప్లాన్…


అలాగే రాష్ట్రంలో మ‌రో ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ పార్టీ ఉండ‌టం.కాంగ్రెస్ లో కూడా పీసీసీ చీఫ్ రేవంత్ సార‌థ్య‌లో జోరుగా చేరిక‌లు ఉండ‌టంతో బీజేపీ నేత‌లు మ‌రింత ఫోక‌స్ పెట్టారు.బండి ప్ర‌జా సంగ్రామ యాత్ర సంద‌ర్భంగా మొదటి చేరిక‌లకు తెరతీయాలని భావిస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా బ‌ల‌మైన వారికోసం ప‌క్కా ప్లాన్ తో చ‌ర్చ‌లు మొద‌లు పెట్ట‌బోతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.అయితే టీఆర్ఎస్ నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచే బీజేపీలోకి చేరికలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక రానున్న రోజుల్లో అమిత్ షాతోపాటు ప్ర‌ధాని మోడీ కూడా త‌రుచు రాష్ట్రంలో ప‌ర్య‌టించే అవ‌కాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ సారి రాష్ట్రంలో ఉన్న అనుకూల ప‌రిస్థితుల‌ను వాడుకుని కమలం జెండాను రెపరెపలాడించాలనే పట్టుదలతో వ్యూహాలు అమ‌లు చేస్తోంది.

అయితే రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉండ‌నుండ‌టంతో హోరాహోరి పోరు ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube