ఇటీవల ఉభయగోదావరి జిల్లాలలో భారీగా వరదలు రావడం తెలిసిందే.కుంభవృష్టిగా కురిసిన వానలకు గోదావరి పోటెత్తింది.
దీంతో వరద బాధితులతో సీఎం జగన్ స్వయంగా మాట్లాడటం జరిగింది.మంగళవారం కోనసీమ జిల్లాలలో సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి.
స్వయంగాబాధితులతో మాట్లాడారు.ట్రాక్టర్ ఫై వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి వరద బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఇదే సమయంలో కలెక్టర్ మరియు ప్రభుత్వం యంత్రాంగం అందిస్తున్న సహాయం గురించి బాధితుల వద్ద ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
ఈ పర్యటనలో పి.గన్నవరం మండలం పరిధిలో.సీఎం జగన్ మాట్లాడుతూ తన వద్దకు వినతి పత్రం చేత పట్టుకుని ఎనిమిది నెలల బాలుడితో వచ్చిన ఓ మహిళతో సీఎం జగన్ మాట్లాడారు.
ఆ సమయంలో ఆ బాబుని జగన్ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది.అయితే ఆ తల్లి చెబుతున్న కష్టాన్ని వింటున్న సమయంలో జగన్ జోబిలో ఉన్న పెన్ బాబు తీసుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఆ బాలుడిని అతని తల్లికి అందజేయగా బాలుడు జగన్ వైపే చూడగా తన జేబులోని పెన్ ఆ ఎనిమిది నెలల బాలుడికి గిఫ్ట్ కింద అందించారు.ఏకంగా ముఖ్యమంత్రి తన కొడుకుకి పెన్ గిఫ్టుగా ఇవ్వటంతో.
ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు.







