వైరల్: పులకిస్తూ నాట్యం చేస్తున్న నెమళ్లు.. వైరల్ అవుతున్న వీడియో!

ఈ ప్రకృతిలోని అందమైన జీవి ఏదంటే మనకి ఠక్కున గుర్తొచ్చేది మయూరము.అవును.

 Viral Peacocks Dancing With Excitement Video Going Viral , Peacock, Dance, Vira-TeluguStop.com

నెమలి చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.ఇక అది పురివిప్పి డాన్స్ చేస్తే ఆ దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం.

ముఖ్యంగా వర్షం పడే ముందు, గాలి బాగా వీస్తున్న సమయంలో నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తాయి.అయితే ఒకేసారి రెండు నెమళ్లు నాట్యం చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతంది.

అలాంటి ఓ అరుదైన వీడియో సోషల్ మీడియాలో ఇపుడు వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని ఓ భవనం బాల్కనీపై కొన్ని నెమళ్లు అటూ ఇటూ తిరుగుతున్నాయి.

ఇంతలో ఓ మగ నెమలి, పురి విప్పింది.ఆ వెంటనే పక్కనున్న తెల్ల నెమలి కూడా ఫించం విప్పింది.

తెల్ల నెమలి పురి విప్పినప్పుడు, అద్భుతంగా కనిపించింది.ఓ రెయిన్ బో కలర్స్ లాగా కనిపించింది.

ఫించాల్లో కొన్ని గ్రీన్ కలర్ ఉండగా మధ్యలోనివి తెలుపు రంగులో ఉన్నాయి.ఆ మధ్యలో పసుపు పచ్చని పింఛాలు ఉండటం గమనార్హం.

సాధారణంగా తెల్ల నెమలి ఫించాలన్నీ తెల్లగానే ఉంటాయి.కానీ ఈ నెమలికి మాత్రం ఇన్ని రంగులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

దాంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ అయింది.ఈ వీడియో చాలా ఎక్కువగా నెటిజన్ల మనసుదోచుకుంటుంది.ఇప్పటివరకు దీనిని కోట్లమంది నెటిజన్లు వీక్షించారు.అలాగే లక్షల్లో లైక్‌ చేస్తున్నారు.ఇక కామెంట్లకు కూడా లెక్కలేదు.

మల్టీకలర్‌ నెమలి అద్భుతంగా ఉందంటున్నారు.వీడియోను చూసి తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

మరెందుకాలస్యం, మీరు కూడా చూసి మీమీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube