బిగ్ బాస్ ప్రేమికులు బాస్ సీజన్ 6 ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే బిగ్ బాస్ ప్రేమికులకు తాజాగా షో నిర్వహకులు గుడ్ న్యూస్ చెప్పారు.
ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ ముగిసిన విషయం తెలిసిందే.అప్పుడు వెంటనే అదే ఊపులో సీజన్ 6ని గ్రాండ్‌గా లాంఛ్ చేయాలని అనుకున్నారు.
అయితే బిగ్ బాస్ ఓటీటీ అట్టర్ ఫ్లాప్ కావడంతో కంటెస్టెంట్స్ ఎంపికతో పాటు షో నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు నిర్వాహకులు.నిజానికి ఓటీటీ షో హాట్ స్టార్‌లో ప్రసారం కావడంతో టీవీలలో చూసే ఆడియన్స్ చాలామంది బిగ్ బాస్ షోను చూడలేకపోయారు.
దీంతో వ్యూవర్ షిప్‌తో పాటు రేటింగ్ కూడా చాలావరకూ పడిపోయింది.
కాగా బిగ్ బాస్ షో హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెంట్ల ఎంపికని బట్టే ఉంటుంది.
అందువల్లే షో నిర్వాహకులు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే బిగ్ బాస్ ఓటీటీ లో మిస్సయిన ఎంటర్టైన్మెంట్ ను కూడా బాస్ సీజన్ 6లో ప్రేక్షకులకు అందించాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ లు చేస్తున్నారు.
ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 4, 2022 ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.అయితే కేవలం సెప్టెంబర్‌లో నెలలోనే ఎందుకూ అంటే గతంలో టాప్ రేటింగ్ కొల్లగొట్టింది కూడా ఈ సెప్టెంబర్ సెంటిమెంట్‌తోనే నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ 4 రికార్డ్ స్థాయిలో టీఆర్పీ సాధించింది.

బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే అత్యధిక రేటింగ్ సాధించింది ఈ సీజన్‌లోనే నాగార్జున హోస్ట్ చేసిన తొలి సీజన్ పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి 21.7 TVR రేటింగ్ సాధించింది.ఇండియాలో ఏ బిగ్ బాస్ ఫినాలేకు రానంత అత్యధిక వ్యూవర్‌షిప్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు వచ్చింది.అన్ని సీజన్ లతో పోల్చుకుంటే అత్యధిక రేటింగ్ సాధించింది మాత్రం సీజన్ 4 అని చెప్పవచ్చు.
ఈ సీజన్‌లో అభిజిత్ విజేత కాగా అఖిల్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.







