కాలిఫోర్నియాలో కార్చిచ్చు... ఎమర్జెన్సీ విధింపు, సురక్షిత ప్రాంతాలకు వేలాది మంది

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణం భిన్నంగా వుంది.భారీ వర్షాలు, వరదల దాటికి భారతదేశం వణికిపోతుంటే… వేడి గాలులు, ఎండల ధాటికి యూరప్ వాసులు అల్లాడిపోతున్నారు.

 Emergency Declared In California Over Wildfire Rages Near Yosemite National Park-TeluguStop.com

అటు అమెరికాలోనూ వేసవి కాలం కావడంతో అక్కడ కార్చిచ్చుల బెడద ఈ సమయంలో ఎక్కువగా వుంటుంది.అందుకు తగ్గట్టుగానే యాస్మైట్ నేషనల్ పార్క్ సమీపంలో కార్చిచ్చు చెలరేగడంతో కాలిఫోర్నియాలో అత్యవసర పరిస్ధితిని విధించారు.

దీని కారణంగా వేలాది మంది నివాసితులు మారుమూల పర్వత ప్రాంతాల నుంచి పారిపోవాల్సి వచ్చింది.

కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ లేదా కాల్ ఫైర్ ప్రకారం.

నిటారుగా వుండే భూభాగం, ఉక్కపోత, కఠినమైన పరిస్ధితుల మధ్య కార్చిచ్చులను అదుపు చేసేందుకు దాదాపు 2000 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.అయితే అగ్నికి ఆజ్యం పోసినట్లు వడగాలులు తోడు కావడంతో మంటలు మరింత ఎగిసిపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

మారిపోసా కౌంటీలోని మిడ్‌పైన్స్ పట్టణానికి సమీపంలోని పార్కుకు నైరుతి దిశలో శుక్రవారం మంటలు చెలరేగాయి.దశాబ్ధాలుగా ఎన్నడూ లేనంత కరువు కారణంగా ఎండిన ఎముకలు, పొడి వృక్షాల వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని అధికారులు తెలిపారు.

ఆదివారం నాటికి 22 చదరపు మైళ్లు (56 చదరపు కి.మీ) అటవీ భూమిని మంటలు కాల్చివేశాయి.సియెర్రా నెవాడా పర్వత ప్రాంతాలలోని 6000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి మరి కొందరు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారని యూఎస్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన అడ్రియాన్ ఫ్రీమాన్ తెలిపారు.

మరోవైపు అగ్నిప్రమాదం కారణంగా మారిపోసా కౌంటీకి గవర్నర్ గావిన్ న్యూసోమ్ అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు.ఆ ప్రాంతంలో అగ్నికీలల కారణంగా 10 నివాస , వాణిజ్య నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.

నష్టాన్ని అంచనా వేసేందుకు అసెస్‌మెంట్ బృందాలు పర్వత పట్టణాలకు చేరుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.యాస్మైట్ నేషనల్ పార్క్‌ వైపు దారి తీసే ప్రధాన మార్గాలలో ఒకటైన స్టేట్ రూట్ 140తో సహా అనేక రహదారులను మూసివేశారు.

Telugu Governorgavin, Sierra Nevada, Yasmitenational-Telugu NRI

ఇకపోతే.కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చులు సర్వ సాధారణమైన విషయమే అయినా.ఇటీవలి కాలంలో వీటి తీవ్రత పెరిగింది.గడిచిన మూడు దశాబ్దాలుగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల వల్ల ఈ ప్రాంతంలో వేడి బాగా పెరిగింది.దీని కారణంగానే తరచుగా కార్చిచ్చులు చోటు చేసుకుని అంతులేని విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube