అమెరికాలోని ఎన్నారైలకు హై అలెర్ట్...ఇలాంటి పరిస్థితులు ఎదురైతే...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో ప్రవాసుల సంఖ్య భారీగానే ఉంటుంది.ఏ దేశంలో నైనా సరే ప్రవాసులు తమ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలంటే ఆదేశ వీసాల జారీ నియమ నిభంధనల విషయంలో ఎలాంటి ఆందోళన కరమైన పరిస్థితులు ఉండకుండా ఉండాలి.

 High Alert For Nris In America If Such Situations Occur , Immigration Document-TeluguStop.com

ఎందుకంటే ప్రవాసులకు ఇమ్మిగ్రేషన్ సంభందిత విషయాలు అత్యంత విలువైనవి.వాటిలో ఎలాంటి లోపాలు తలెత్తినా సరే ఆందోళన చెందుతారు.

మరి అలాంటి సెన్సిటివ్ విషయంలో మీ ఇమ్మిగ్రేషన్ పత్రాలలో లోపాలున్నాయని ఫోన్ కాల్ వస్తే ఎలా ఉంటుంది.అచ్చం ఇలాంటి సంఘటనే అగ్ర రాజ్యం అమెరికాలో కొందరు భారతీయ ఎన్నారైలకు ఎదురయ్యింది.

అమెరికాలో ఉంటున్న ఓ భారత సంతతి వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది తాము ఇమ్మిగ్రేషన్ అధికారినని గతంలో మీరు అందించిన ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్స్ ప్రస్తుత వివరాలతో పోల్చితే మ్యాచ్ అవ్వడం లేదని మీ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉందని, మీరు చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని తాము చెప్పింది చేయకపోతే ఇబ్బందులు పడుతారని కొంచం గద్దించిన స్వరంతో చెప్పడంతో ఒకింత కంగారు పడ్డ సదరు ఎన్నారై కొంత డబ్బు చెల్లించడం ఆ తరువాత అది మోసపూరిత కాల్ అని తెలుసుకుని షాక్ అయ్యాడట.

అమెరికాలో ఈ తరహా ఫోన్ కాల్స్ ఎన్నారైలకు వెళ్తున్నాయని ఎంతో మంది తెలివిగా వారిని లైన్ లోనే ఉంచి తమ ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలూ చూసుకునే అధికారికి కాల్ చేసి అది ఫేక్ కాల్ అని నిర్దారించుకున్తున్నారు.

కానీ కొంత మంది మోస పోతున్నారు కూడా.ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులకు గానీ లేదంటే కన్సల్టెన్సీలను గానీ సంప్రదించాలని పోలీసులు కన్సల్టెన్సీ సంస్థలు కోరుతున్నాయి.

ఇమ్మిగ్రేషన్ అధికారులమని, డబ్బు చెల్లిస్తే ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్స్ లో ఉన్న లోపాలు తొలగిపోతాయని , మీ కాల్ రికార్డ్ అవుతోంది లైన్ లోనే ఉండండి అంటూ కాల్స్ చేసే వారి విషయంలో జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube