రద్దీగా ఉండే వీధుల్లో ఎలుకలు పక్షులపై దాడి చేసే దృశ్యాలు కనిపించడం చాలా అరుదు.అయితే, ఇటీవల న్యూయార్క్ నగరంలో ఒక పావురంపై ఒక ఎలుక భీకరమైన దాడి చేసింది.
ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ ఎలుక కొంచెం కూడా భయం లేకుండా పావురం పై దాడి చేసి దాన్ని లటుక్కున కారు కిందకి తీసుకెళ్ళింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.ఈ వీడియోను కొన్ని రోజుల క్రితం @WhatIsNewYork అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.
అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.ఈ వీడియో ఇప్పటివరకు 70 వేల కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది.
ఈ క్రూరమైన ఎలుక ఒక పావురంపై దాడి చేసి చంపడం చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.పావురం శరీరంలోకి ఎలుక తన పళ్లను లోతుగా దింపడంతో ఆ పక్షి అల్లాడిపోయింది.
దాని గట్టి పట్టు నుంచి విడిపించుకొని ఎగిరి పోవడానికి చాలా ప్రయత్నించింది.కానీ అది సాధ్యం కాలేదు.
ఎలుక బలంగా ఆ పావురాన్ని పట్టుకొని ఒక కారు కిందకి తీసుకెళ్లి చంపేసింది.
ఈ వీడియో చూసిన వాళ్లు షాక్ అవుతున్నారు.“వామ్మో, ఈ ఎలుక మామూలుది కాదు ఏకంగా పావురాన్నే పట్టుకొని చంపేసింది.” అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.ఎలుకలు కూడా ఇంత వైలెంట్ గా ఉంటాయా అని ఇంకొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్, వేళల్లో లైకులు వచ్చాయి.ఈ షాకింగ్ వీడియోని మీరు కూడా వీక్షించండి.







