తన సినిమానే చూస్తూ నిద్రపోయిన కరీనా కపూర్.. నెటిజన్స్ వైరల్ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా.ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలుస్తుంది.ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.కాగా ఈ సినిమా హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.అలాగే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా రేపు నెల అనగా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Kareena Kapoor Sleeping While During Laal Singh Chaddha Screening Kareena Kapoor-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోలు రన్ అవుతున్నాయి.ఈ క్రమంలోని అనగా ఒక ప్రీమియర్ షో కి అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు హాజరయ్యారు.

వీరితో పాటుగా హీరోయిన్ కరీనా కపూర్ కూడా హాజరైంది.కాగా ప్రీమియర్ షోను చూడడానికి వచ్చిన అమీర్ ఖాన్, కిరణ్ రావు లు చక్కగా ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

కానీ ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన కరీనా కపూర్ మాత్రం సినిమాను చూడకుండా నిద్రపోతోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఆ ఫోటోలలో అమీర్ ఖాన్ మధ్యలో కూర్చోగా కరీనాకపూర్, కిరణ్ రావు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు కూర్చున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో ఆ ఫోటోలపై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు లాల్‌ సింగ్‌ చద్ధా చిత్రం చాలా బోరింగ్‌గా ఉన్నట్లుంది అందుకే కరీనా నిద్రపోతోంది అని కామెంట్ చేయగా,ఇంకొందరు ఫారెస్ట్ గంప్‌ సినిమాను అమీర్‌ చూడలేదేమో అందుకే బాగా ఎమోషనల్‌ అవుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఈ ఫోటోతో కరీనాకపూర్ ని అలాగే అమీర్ ఖాన్ ని సరదాగా ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజెన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube