బంపర్ ఆఫర్ ప్రకటించిన పబ్: బీర్ కావాలా? డబ్బులకు బదులు ఓ సన్ ఫ్లవర్ ఆయిల్ బాటిల్ ఇవ్వండి చాలు!

మీరు విన్నది అక్షరాలా నిజమే.బీర్ కావాలంటే అక్కడ డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.

 Viral Pub Offers Sunflower Oil Bottle Instead Of Beer Details, Bumper Offer, Lot-TeluguStop.com

బదులుగా ఒక ఆయిల్ బోటిల్ ఇస్తే సరిపోతుంది.రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల కొరత తీవ్రత ఏరకంగా వుందో చెప్పాల్సిన పనిలేదు.

ముఖ్యంగా.యూరప్ కంట్రీస్‌లో ఈ సమస్య తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవాలి.

దానికి కారణం.సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ ప్రపంచ ఎగుమతుల్లో 80% ఈ రెండు దేశాల నుంచే అవుతోంది.

అయితే, ఈ రెండు దేశాల మద్య యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.అక్కడ రాప్‌సీడ్, సన్‌ఫ్లవర్ ఆయిల్ బాటిల్స్ కంటికైనా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో జర్మనీలో ఈ వంటనూనె కొరతను అధిగమించడానికి ఒక పబ్ వినూత్న ప్రయోగం చేసింది.సాధారణంగా ఆల్కాహాల్ తాగితే ఎక్కడైనా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.కానీ, ఇక్కడ మాత్రం పబ్‌కు వచ్చే కస్టమర్లు.బీర్ తాగనిందుకు నగదు చెల్లించే బదులు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ ఇచ్చి బిల్లు చెల్లించాలని కోరుతోంది.

దక్షిణ జర్మనీలోని మ్యూనిచ్‌లోని గీసింజర్ బ్రూవరీ అదే పరిమాణంలో సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో వినియోగదారులకు వారి ఇష్టమైన బీర్‌ను లీటరుకు అందజేస్తోంది.దీనికి సంబంధించిన ఆఫర్ ప్రకటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

పబ్ మేనేజర్ ఎరిక్ హాఫ్‌మన్ ఈ విషయంపైన ఓ వార్తావేదికపైన మాట్లాడుతూ… “ఆయిల్ దొరకడం కష్టంగా ఉంది.పబ్‌లో ష్నిట్జెల్స్‌ స్నాక్స్ వేయించడానికి వారానికి 30 లీటర్ల ఆయిల్ అవసరం పడుతుంది.అయితే, ప్రస్తుత పరిస్థితులలో 15 లీటర్లు మాత్రమే ఇక్కడ దొరుకుతోంది.దీని కారణంగా ఏదో ఒకరోజు ష్నిట్జెల్స్‌ స్నాక్స్ అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది.” అని చెప్పుకొచ్చాడు.కాగా, ఈ బార్‌లో ప్రసిద్ధ సెంట్రల్ యూరోపియన్ స్నాక్స్ ష్నిట్జెల్స్‌(మాంసం).

దీనిని మద్యం ప్రియులు మంచింగ్‌గా విపరీతంగా ఆరగిస్తారు.దీనిని తయారు చేయడానికి నూనె కొరత ఏర్పడటం వల్లే పబ్ మేనేజ్‌మెంట్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube