సినిమా ఇండస్ట్రీ.ఇది ఒక రంగుల ప్రపంచం.
ఇందులో సక్సెస్ తో పాటు టాలెంట్ ఉంటే మాత్రమే రాణించగలరు.కాగా టాలెంట్ గురించి పక్కన పెడితే సక్సెస్ ఉంటే వారిని ఒక రేంజ్ లో నిలబెడుతుంది.
ఒకవేళ సక్సెస్ లేకపోతే కనీసం వారిని పట్టించుకునే వారు కూడా ఉండరు అని చెప్పవచ్చు.అయితే కొంతమంది వారి టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఎటువంటి చిన్న అవకాశం దొరికిన కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని సక్సెస్ తోనే సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనీ అటువంటివి కొన్నిసార్లు మిస్ ఫైర్ అయ్యి కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉంటాయి.
ఇకపోతే అసలు విషయంలోకి వెళితే ఇటీవల ఒక స్టార్ డైరెక్టర్,మరొక దర్శకుడికి అవకాశం ఇచ్చి తనకు సన్నిహితంగా ఉండే ఒక స్టార్ హీరోకు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించాడు.
ఆ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ స్క్రీన్ ప్లే బాధ్యతల్ని మాత్రం తానే తీసుకుని కేవలం డైరెక్షన్ చేసే అవకాశం మాత్రం బిగ్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడికి ఇచ్చారు.అయితే రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ సదరదర్శకుడు స్టార్ హీరో తో సినిమా అనగానే కాస్త సంతోషించారు.
అలా అనుకున్న విధంగా సినిమాను మొత్తానికి పూర్తి చేశాడు.
ఆ సినిమాతో ఆ దర్శకుడికి స్టార్ డైరెక్టర్ అన్న ముద్ర పడి స్టార్ హీరోతో తొలి సినిమా చేశాను అన్న తృప్తి మాత్రమే మిగిలింది.
కానీ ఆ డైరెక్టర్ కి క్రెడిట్ ఎంత మాత్రం దక్కలేదు.ఆ దర్శకుడు సినిమాకు దర్శకత్వం వహించినప్పటికీ దాని క్రెడిట్ మొత్తం ఆ స్టార్ డైరెక్టర్ కి వెళ్ళిపోయింది.
అయితే ప్రస్తుతం సదరు దర్శకుడికీ సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆ స్టార్ డైరెక్టర్ యువ దర్శకుడికి అవకాశం ఇచ్చి హెల్ప్ చేశాడా? లేకపోతే అతని కెరీర్ ని నాశనం చేశాడా? అంటూ సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.కాగా ఆ సినిమా విడుదల అయి రెండు నెలలు పూర్తి అవుతున్న కూడా సదరు దర్శకుడు చేతిలో ఒక సినిమా కూడా లేకపోవడం గమనార్హం.







