పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ నటి.. ఎవరంటే?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.కాగా పలువురు సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతుండగా ఇంకొంతమంది సెలబ్రిటీలు తల్లి కాబోతున్నారు.

 Manali Rathod Gives Birth Baby Girl Manali Rathod, Tollywood, Baby Girl, Vijith-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.అలాగే టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత కూడా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మరొక టాలీవుడ్ హీరోయిన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.ఆ హీరోయిన్ మరెవరో కాదు నటి మనాలి రాథోడ్.

మనాలి రాథోడ్ తెలుగులో గ్రీన్ సిగ్నల్, ఓ స్త్రీ రేపు రా, ఫ్యాషన్ డిజైనర్, నేను లోకల్, హౌరా బ్రిడ్జ్, ఎమ్మెల్యే లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.హైదరాబాద్ కు చెందిన మనాలి రాథోడ్ అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ఇకపోతే మనాలి రాథోడ్ 2019, నవంబర్ లో విజిత్ వర్మను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.విజిత్ వర్మ బిజెపి నాయకుడు.

వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం.ఇకపోతే ఇటీవలే మనాలి రాథోడ్ ప్రెగ్నెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

Telugu Baby, Green Signal, Manali Rathod, Tollywood, Vijith Varma-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా మనాలి రాథోడ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.కాగా ఈమె ఈనెల జూన్ 18వ తేదీన ఆడబిడ్డకు జన్మనివ్వగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే పెళ్లి తర్వాత మనాలి రాథోడ్ సినిమాలకు దూరంగా ఉంది అన్న విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ సినిమాలకు బై బై చెప్పేసింది.ఈమె మొదట సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసింది.ఆ తర్వాత మొదటిసారిగా 2014లో గ్రీన్ సిగ్నల్ సినిమాతో వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చింది మనాలి రాథోడ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube