మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎంతోమంది డైరెక్టర్లతో పని చేశారు.ఎంతోమంది దర్శకుల పనితనాన్ని చిరంజీవి బహిరంగంగా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి.
చిరంజీవి ఇష్టమైన డైరెక్టర్లలో వీవీ వినాయక్ కూడా ఒకరని చెప్పవచ్చు.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎన్నో సినిమాలు విజయం సాధించగా చిరంజీవి వీవీ వినాయక్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.
ఈ కాంబినేషన్ లో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయనే సంగతి తెలిసిందే.అయితే ఒక ఇంటర్య్వూలో వినాయక్ మాట్లాడుతూ చిరంజీవికి నేనంటే ఎందుకు ఇష్టమో నేనెలా చెప్పగలనని ఆయన కామెంట్ చేశారు.
నాకు మాత్రం చిరంజీవిగారు అంటే చాలా ఇష్టమని వినాయక్ చెప్పుకొచ్చారు.ఖైదీ సినిమా చూసిన సమయంలో చిరంజీవిపై అభిమానం ఏర్పడిందని ఆయన అన్నారు.

చిరంజీవి సినిమా రిలీజైతే థ్రిల్లింగ్ గా ఉండేదని వినాయక్ తెలిపారు.ఎంత తెలిసినా కూడా నేర్చుకునే స్వభావం ఉన్న హీరో చిరంజీవి అని వినాయక్ చెప్పుకొచ్చారు. చిరంజీవి ఫ్యాన్స్ లో మార్పు తెచ్చారని వినాయక్ తెలిపారు.చిరంజీవి బయోగ్రఫీ తీయాలని తాను ఎప్పుడూ అనుకోలేదని వినాయక్ చెప్పుకొచ్చారు.బిహేవియర్, డిగ్నిటీ ఎంత తెలిసినా జీవితాంతం నేర్చుకోవాలనే తపన చిరంజీవిలో ఉంటుందని వినాయక్ కామెంట్ చేశారు.
వీవీ వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఛత్రపతి రీమేక్ ను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా రిజల్ట్ విషయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వినాయక్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఈ సినిమా రిజల్ట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ కు పని చేసే అవకాశం మొదట వినాయక్ కు దక్కినా కొన్ని కారణాల వల్ల వినాయక్ ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి ఉంది.







