మీరు విన్నది నిజమే.తాజాగా ఒక కుటుంబం గుండె జబ్బుతో బాధపడుతున్న తమ 67 ఏళ్ల కుటుంబ సభ్యురాలి ఆపరేషన్ కోసం ఏకంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించారు.
ఎలా అంటే, వీరు ఆమెను ఒక ఇండియన్ ఎయిర్ అంబులెన్స్‌లో US నుంచి భారతదేశానికి తరలించారు.ఈ విమానయానం 26 గంటల పాటు కొనసాగగా.ఇందుకు అక్షరాలా 133,000 డాలర్లు అంటే మన రూపాయలలో రూ.1 కోటి కంటే ఎక్కువ ఖర్చు చేసారు.కాగా ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆ కుటుంబాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.బెంగళూరులోని ఇందిరానగర్‌కు చెందిన 67 ఏళ్ల మహిళ కొంత కాలంగా గుండె జబ్బుతో బాధ పడుతున్నారు.
ఈ తీవ్రమైన జబ్బుకు మెరుగైన చికిత్స కోసం ఆమె అమెరికాకి వెళ్లారు.అక్కడ చికిత్స తీసుకుంటూనే తన పిల్లలతో కలిసి ఒరెగాన్‌లో నివసిస్తోంది ఆ కుటుంబం.
అయితే USలో వైద్యం తీసుకున్నా ఆమె ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు.దాంతో కుటుంబ సభ్యులు ఆమెకు USలో ఎక్కువ ఖర్చు పెడుతున్నప్పటికీ తగిన వైద్యం లభించడం లేదని భావించి, ఆమెను లెగసీ గుడ్ సమారిటన్ మెడికల్ సెంటర్ నుంచి పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంబులెన్స్‌లో తరలించారు.
ఇక ఈ వేలాది కిలోమీటర్ల తరలింపును ఇటీవలి కాలంలో భారతదేశానికి అత్యంత సుదీర్ఘమైన ఏరోమెడికల్ తరలింపుగా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు.తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పరిస్థితి విషమంగా మారినప్పుడు మెరుగైన వైద్యం కోసం మంచి ఆసుపత్రికి తీసుకెళ్లడం సాధారణమైన విషయం.
మంచి ఆసుపత్రి ఎక్కడున్నా సరే అక్కడికి రోగులను తరలించేందుకు వారి కుటుంబసభ్యులు సిద్ధమవుతారు.అయితే ఈ రేంజ్ ఖర్చు చేయడానికి మాత్రం ఎవరన్నా కాస్త సంకోచిస్తారు.కానీ ఆ కుటుంబం అలా చేయలేదు.ఆమె చికిత్సకోసం తమకున్న యావదాస్తిని తాకట్టుపెట్టారు.







