ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు.పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసే పెద్ద పెద్ద సినిమాలకే ప్రేక్షకులు అంతంత మాత్రం థియేటర్లోకి వచ్చి సినిమాను చూస్తున్నారు.
ఒక చిన్న సినిమాల పరిస్థితి అయితే మరి దారుణం అని చెప్పవచ్చు.కాగా ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేసి ఇంట్లోనే ఉంటూ ఓటీటీ లో సినిమాలోని వీక్షిస్తున్నారు.
దీనితో ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాలు కనీసం రెండు వారాలకు మించి కూడా ఆడలేకపోతున్నాయి.అయితే ఇదే విషయం గురించి పలువు నిర్మాతలు, దర్శకులు కూడా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
కాగా కొంతమంది దర్శక నిర్మాతలు సినిమా విడుదలైన తర్వాత 50 రోజుల వరకు సినిమాను ఓటిటిలో విడుదల చేయడానికి ఇష్టపడటం లేదు.అయితే ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు కూడా గ్రహించారు.
కరోనా ముందు,తరువాత దిల్ రాజు వరుసగా భారీ ప్రాజెక్టులను ప్రకటించిన విషయం తెలిసిందే.కదా ఆ ప్రాజెక్టులలో కొన్ని ప్రాజెక్టులు విడుదల కాగా మరికొన్ని షూటింగ్ జరుపుకుంటున్నాయి.
కాగా ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే దళపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు పేరుతో నిర్మితమవుతున్న సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఇది ఇలా ఉంటే ఇటీవల థాంక్యూ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన దిల్ రాజు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.కరోనా సమయంలో దర్శకులు అందరూ ఏవేవో కథలు వినిపించి హీరోల డేట్స్ లాక్ చేసుకున్నారని, అయితే అవి ఇప్పటికీ అవుట్ డేటెడ్ అయ్యాయని బాంబ్ పెల్చేశారు.
అంతేకాకుండా కరోనా సమయంలో ప్రేక్షకులు వరల్డ్ సినీమాపై అవగాహన పెంచుకున్నారని రెగ్యులర్ కథలతో ప్రేక్షకులను సంతృప్తి పరచడం చాలా కష్టమని ఆయన తెలిపారు.కరోనా సమయంలో దిల్ రాజు మొత్తం పది కథలు విన్నారట.
వాటిని ఫైనల్ చేసి సినిమాలు కూడా చేయాలి అనుకున్నారట.కానీ సర్వన మహమ్మారి తర్వాత ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోవడంతో వాటిని దృష్టిలో ఉంచుకొని ఆ పది కథలను పక్కన పెట్టేసారట నిర్మాత దిల్ రాజు.
అంతేగాకుండా సెట్స్ పైకి వెళ్లాల్సిన రెండు సినిమాలను కూడా అర్ధాతరంగా ఆపేసారట.ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
కాగా ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు చిన్న సినిమాలు నిర్మించడంతోపాటు వారి సంస్థ ద్వారా వెబ్ సీరిస్ లను కూడా బ్యాక్ టు బ్యాక్ నిర్మించడానికి సిద్ధపడుతున్నారట.







