థాంక్యూ సెన్సార్ పూర్తి.. చైతూ ఎంత రన్ టైంతో రాబోతున్నాడంటే ?

యంగ్ హీరోల్లో అక్కినేని నాగ చైతన్య ఒకరు.ఈయన ఎప్పుడు క్లాసీ లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.

 Naga Chaitanya Thank You Censor Review, Naga Chaitanya , Rashi Khanna , Thank Yo-TeluguStop.com

అలాగే వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నాడు ఈ అక్కినేని వారసుడు.ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ‘ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని మరో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న చైతూ ఇప్పుడు అందరికి థాంక్యూ చెప్పడానికి వస్తున్నాడు.

ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.రిలీజ్ దగ్గర పడుతుండడంతో వరుస ఇంటర్వ్యూలు చేస్తూ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచడానికి చిత్ర యూనిట్ కృషి చేస్తుంది.

అయితే ఈ సినిమా నుండి తాజాగా మరొక వార్త అఫిషియల్ గా బయటకు వచ్చింది.

Telugu Avika Gore, Vikram Kumar, Malvika Nair, Naga Chaitanya, Nagachaitanya, Ra

ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రన్ టైం కూడా లాక్ చేసుకుంది.ఇక సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.అలాగే రన్ టైం ను 129 నిముషాలుగా మేకర్స్ కట్ చేసారు.

మరి ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఇది పర్ఫెక్ట్ సినిమా అనే చెప్పాలి.జులై 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

మరి ఈ సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకుని సక్సెస్ గ్రాఫ్ ను అలాగే కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube