ఒకప్పుడు ఆ అసెంబ్లీ స్థానం టీడీపీకి కంచుకోట….మారిన రాజకీయ పరిణామాల్లో జగన్ ఒక్క చాన్స్ అంటూ ఫ్యాన్ గాలి ఊపడంతో ప్రజలు ఆ గాలిలో కొట్టుకుపోయారు.
మూడేళ్ల వైసీపీ పాలన చూశాక వారి ఆశలు అడిఆసలయ్యాయి.విసిగి వేసారిన జనం మరోసారి టీడీపీవైపు చూస్తున్నారు.
కానీ, ఆ పార్టీ మాత్రం జనం ఆశించినరీతిలో వారి సమస్యలపై స్పందించడం లేదన్న విమర్శలొస్తున్నాయి.ఓట్లేసి గెలిపించుకున్న నేత ఏమో అధికారంలో తమ పార్టీ ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు.
కనీసం తమకోసం ఆందోళనలైనా చేస్తుందనుకున్న ప్రతిపక్ష పార్టీ వర్గ విబేధాలతో సతమతమవుతోంది.
రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది…ఇది పక్కనే ఉన్న కర్ణాటక రాష్ర్టం బళ్లారికి దగ్గరలో ఉంటుంది.
దాంతో ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరుగుతుంటాయి.వ్యాపారపరంగా రెండో ముంబయిగా ఆదోనిని ఇక్కడి జనం భావిస్తారు.అందుకే ఆదోనీని జిల్లా చేయాలని పశ్చిమ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు.
ఆదోని నియోజకవర్గం మొదటి నుంచీ టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం….
ఆ పార్టీకి ఇక్కడ చురుకైన కారకర్తలున్నారు.ఇక్కడ గతంలో ఎం.ఎల్.ఏగా గెలుపొందిన మీనాక్షినాయుడు ప్రస్తుతం టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు…పార్టీలో ఈయనే సీనియర్ నేత కూడా… ఒక రకంగా చెప్పాలంటే ఆదోని టీడీపీ అంటేనే మీనాక్షి నాయుడు అన్నట్లుగా ఆ పార్టీ నడుస్తోంది.కాగా,ఇక్కడి టీడీపీ నేతల మధ్య ఉన్న విబేధాలే ఆ పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాయి.గడిచిన ఎన్నికల్లో జగన్ ఒక్క చాన్స్ పేరుతో ప్రజల్లోకి రావడం.ఫ్యాన్ గాలి వీయడంతో.మరోసారి ఈ నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంది…

అయితే, ఆదోనిలో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.ప్రజలు తాము పొరపాటు చేసినట్లుగా గ్రహించుకున్నారు.తమ ప్రాంతంతోపాటు రాష్ర్టాన్ని అభివృద్ది చేసే చంద్రబాబుని రెండు సార్లు మిస్ చేసుకున్నందుకు బాధలు అనుభవిస్తున్నామని రియలైజ్ అయ్యారట….
ఎందుకలా అంటే 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డిని గెలిపిస్తే.తమ ప్రభుత్వం అధికారంలో లేనందున తాను అభివృద్ది చేయలేకపోయానని చెప్పుకున్నారట… 2019 ఎన్నికల్లోనూ సాయిప్రసాద్ రెడ్డినే గెలిపించారు.
ఇప్పుడు ఆయన పార్టే అధికారంలో ఉన్నా ఆదోని అభివృద్దిని గాలికొదిలేశారట….ప్రజల సమస్యలేవీ పట్టించుకోవడంలేదట….పైగా ఆయన వర్గీయుల దాడులతో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారట.మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం .పెరిగిన కరెంట్ ఛార్జీలు, నల్లా బిల్లు, ఆస్తి పన్నులు, చెత్త పన్నులతో విసిగిపోయారట.అందుకే గడప.గడప పేరుతో తమ ముందుకు వస్తున్న సాయిప్రసాద్ రెడ్డిని.మళ్లీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నావంటూ ప్రతి గుమ్మంలోనూ మహిళలు కడిగి పారేస్తున్నారట.







