రాజకీయాలు, సినిమాలు, ఇతర రంగాలలో సక్సెస్ కావడం కష్టమే అయినా ఈ రంగాలలో సక్సెస్ సాధించిన వాళ్లు తర్వాత రోజుల్లో ఫెయిలైన సందర్భాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి.అయితే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగిన శ్రీనువైట్ల ప్రస్తుత పరిస్థితిని తలచుకుంటే మాత్రం జాలి వేస్తోంది.
శ్రీనువైట్ల చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు.ఢీ సీక్వెల్ కు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు.
మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా అనే సినిమాతో బిజీగా ఉన్నారు.శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా గురించి స్పందించడానికి కూడా మంచు విష్ణు ఇష్టపడటం లేదు.
వరుస విజయాలతో ఒక వెలుగు వెలిగిన శ్రీను వైట్లకు ఇలాంటి పరిస్థితి రావడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.మరోవైపు శ్రీనువైట్లతో విడాకులు తీసుకోవడానికి ఆయన భార్య రూపా వైట్ల సిద్ధమయ్యారు.
వాస్తవానికి చాలా సంవత్సరాల క్రితమే శ్రీనువైట్లతో విడిపోవాలని ఆమె ప్రయత్నించారు.
అయితే ఆ సమయంలో పెద్దలు సర్దిచెప్పడంతో రూపా వైట్ల తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
రూపా వైట్ల పలు సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా వ్యవహరించారు.గత మూడు రోజుల నుంచి విడాకుల వార్తలు వైరల్ అవుతున్నా ఆ వార్తల గురించి స్పందించడానికి శ్రీనువైట్ల కానీ రూపా వైట్ల కానీ ఇష్టపడటం లేదు.
శ్రీనువైట్లతో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా లేరు.

ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ సినిమాల ఫలితాలు శ్రీనువైట్ల కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయి.శ్రీనువైట్ల చిన్న హీరోలతో సినిమాలను తెరకెక్కించడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.శ్రీను వైట్ల భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
శ్రీనువైట్లకు గతంతో పోలిస్తే ఆఫర్లు తగ్గడంతో ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.







