రాష్ట్రపతి ఎన్నికల్లో జోరుగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. యశ్వంత్ సిన్హాకు బదులుగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు పలువురు విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేసినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఓటు వేశారు.అయితే అది పొరపాటున జరిగిందని ఆమె చెబుతున్నారు.రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది.అయితే ఈ పోలింగ్ లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది.విపక్షాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము కు ఓటు వేసినట్టు సమాచారం.విపక్షాలకు చెందిన అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఉన్న వ్యతిరేకత వల్లే వీరు బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు.అయితే అదిపొరపాటుగా జరిగిందని ఆమె చెబుతున్నారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

15వ రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం జరిగాయి.ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.వీరంతా 4,800 మంది దాకా ఉన్నారు.
ఢిల్లీలోని పార్లమెంటు భవనం, రాష్ట్రాల్లోని అసెంబ్లీ భవనాల్లో ఈ ఎన్నికలు జరిగాయి.జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగనున్నది.25వ తేదీన కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫు అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుంది.ఎంపీలందరి ఓటు విలువ 700 ఉంటుంది.ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓట్ల విలువ 10,86,431గా ఉంది.
ఇక విపక్షాల తరఫు అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్, ఎన్సీపీ, టీఎంసీ, ఆప్, డీఎంకే, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, ఆర్జేడీ, ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ తదితర 17 పార్టీలు మద్దతు ప్రకటించాయి.
అయితే విపక్షాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసినట్టు తెలుస్తోంది.







