టాలీవుడ్ లో అగ్ర దర్శకుడుగా వెలుగొందుతున్నాడు జక్కన్న. ఈయన ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా చూడలేదు.
అందుకే 99 శాతం సక్సెస్ రేట్ ను కలిగి ఉన్నాడు రాజమౌళి.ప్రసెంట్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎందరో లెజెండరీ డైరెక్టర్లలో రాజమౌళికి తప్ప మరే డైరెక్టర్ కు ఈ సక్సెస్ రేట్ లేదు.బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగాడు.
బాహుబలి రిలీజ్ అయినా తర్వాతే కరణ్ జోహార్ ఈయనను బాలీవుడ్ ను తీసుకు వెళ్లాలని అనుకున్నాడు.
అయితే రాజమౌళి మాత్రం అందుకు ససేమిరా అన్నారు.మరి ఇలాంటి లెజండరీ డైరెక్టర్ తర్వాత టాలీవుడ్ లో మరొక టాప్ డైరెక్టర్ ఎవరా అని ఆరా తీస్తే.
అందరు సుకుమార్ పేరు చెబుతున్నారు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో సుకుమార్ ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమాతో ఈయన రేంజ్ మరింత పెరిగింది అనే చెప్పాలి.
అది ఎంత పెరిగింది అంటే.ఇటీవలే అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా ప్రివ్యూ చూసేందుకు సుకుమార్ ను సైతం ఆహ్వానించారు.
ఇలా అమీర్ ఖాన్ పక్కన కూర్చుని సినిమా చూసే రేంజ్ కు ఈయన క్రేజ్ పెరిగింది.
ఆ రకంగా రాజమౌళి క్రేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా సుకుమార్ రేంజ్ కూడా ఉంది అన్నది స్పష్టం అవుతుంది.రాజమౌళి వెనుక ఆయన ఫ్యామిలీ నే ఉంది.ఈ టీమ్ తోనే ఈయన వరుస హిట్స్ అందుకున్నాడు.
కానీ సుకుమార్ మాత్రం ఇలాంటి టీమ్ లేకుండానే అన్ని తానే చూసుకుంటూ ఈ రేంజ్ కు చేరుకున్నాడు.
కథ నుండి డైలాగ్స్ వరకు అన్ని తానె రాసుకుని హీరోలకు సూపర్ హిట్ అందించాలి అంటే రాజమౌళి కంటే ఎక్కువ ప్రెషర్ నే అనుభవిస్తూ ఉంటారు.అలా అన్ని చేసుకుంటూ ఈ రేంజ్ కు చేరుకున్నాడు సుకుమార్.మరి ఇలాంటి ఇద్దరి అగ్ర డైరెక్టర్ల మధ్య ఫ్యూచర్ లో పోటీ తప్పదు అని అంతా భావిస్తున్నారు.బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు సైతం సుకుమార్ పై కన్నేశారు.మరి దీంతో ఈ ఇద్దరి మధ్య పోటీ రోజురోజుకూ బలపడుతుంది.ఫ్యూచర్ లో మరి ఈ ఇద్దరి మధ్య పోటీ నిజంగానే ఉండబోవడం ఖాయం.