అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శృతిహాసన్.ఈమె నటించిన మొదటి సినిమాలన్నీ వరుస ప్లాప్ కావడంతో ఇండస్ట్రీలో ఈమెను ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు.
అయితే పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ కొట్టడంతో తనపై ఉన్న ఆ ముద్ర చెరిగిపోయింది.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఇదివరకే విదేశీ వ్యక్తితో ప్రేమలో పడిన శృతిహాసన్ అతనితో బ్రేకప్ అయిన తర్వాత కొన్ని రోజులపాటు ఆ డిప్రెషన్లో తన కెరీయర్ ను కూడా పక్కన పెట్టారు.అయితే ప్రస్తుతం ఈమె ముంబైకి చెందిన డూడల్ ఆర్టిస్ట్ శంతను హాజరిక అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు.
ఈ క్రమంలోనే తన ప్రియుడితో కలిసి ఈమె పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఇదివరకే తన ప్రియుడితో కలిసి ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకున్న శృతిహాసన్ తాజాగా మరోసారి తన ప్రియుడుతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియోలో భాగంగా శృతిహాసన్ క్యూట్ పెర్ఫార్మెన్స్ చేయగా ఆమె ప్రియుడు మాత్రం తనతో పాటు డాన్స్ చేయడానికి సంకోచించాడు.తనతో పాటు డాన్స్ చేయడానికి తన ప్రియుడు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తున్నారు.అలాగే బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్ర హీరోల సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని సంపాదించుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో శృతిహాసన్ ఎంతో బిజీగా ఉన్నారు.







