తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో సినిమాలకు అద్భుతంగా పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది గీతామాధురి.
ఆ తర్వాత బిగ్బాస్ హౌస్కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.అయితే బిగ్ బాస్ హౌస్ కీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ఆమెకు మరింత ఫాలోయింగ్ పెరిగిపోయింది.
కాగా బిగ్ బాస్ రెండవ సీజన్ విన్నర్ గా అవ్వాల్సింది రన్నరఫ్ గా సరిపెట్టుకుంది.ఇక బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గీతామాధురికి అవకాశాలు మరింత పెరిగాయి.
ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు ఈవెంట్లలో పాటలు పాడుతూ మెప్పిస్తూ వస్తోంది.గీతా మాధురి యాక్టర్ నందుని పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది గీతామాధురి.అయితే గీతా మాధురి పై అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి.
కానీ గీతామాధురి ఆ నెగిటివ్ కామెంట్లకు ఏమాత్రం భయపడకుండా తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా గీతామాధురి తన అభిమానులను అలర్ట్ చేసింది.

గీతా మాధురి అన్న పేరుతో ఎవరో ఫేక్ పర్సన్ వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారని ఆమె తెలిపింది.యుఎస్ నుంచి తన పేరు ఫోటోలను పెట్టుకొని చాటింగ్ చేస్తున్నారని అలాంటి వారిని నమ్మద్దని మీరు మీ కాంటాక్ట్ లను షేర్ చేసుకోవద్దు జాగ్రత్తగా ఉండండి అంటూ తన ఫ్యాన్స్ ని హెచ్చరించింది గీతామాధురి.గీతా మాధురి తెలుగులో యా యా బాలయ్య, పక్కా లోకల్, శానా కష్టం ఇలా ఎన్నో పాటలను పాడి ప్రేక్షకులను అలరించింది.







