ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల హోమ్ టూర్ లు అన్నది కామన్ గా మారిపోయింది.బుల్లితెర సెలబ్రిటీల నుంచి వెండితెర సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా హోమ్ డోర్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే వెండితెర సెలబ్రిటీలు అయిన మంచు లక్ష్మి, తమన్నా, కాజల్ లాంటి వారు కూడా హోమ్ టూర్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోమ్ టూర్ అన్నది ట్రెండింగ్ గా మారిపోయింది.
అయితే కొంతమంది సెలబ్రిటీల హోమ్ టూర్లను మీడియా వారు చేస్తుండగా ఇంకొంతమంది పర్సనల్ గా హోమ్ టూర్ వీడియోలను చేసి సోషల్ పోస్ట్ చేస్తున్నారు.
కాగా ఆ జాబితాలోకి ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు కూడా చేరింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ స్టార్ కృష్ణ హోమ్ టూర్ కి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల గట్టమనేని స్వయంగా తన తండ్రి ఇంటి హోం టూర్ చేసింది.
ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేసింది.అయితే హోమ్ టూర్ వీడియోలో ఇల్లు మొత్తం చూపించింది.1.26 నిమిషాల నిడివి ఉన్న ఆ ప్రోమో వీడియోలో కృష్ణ ఇళ్లు ఎలా ఉంటుందో శాంపిల్ చూపించారు.అయితే జస్ట్ శాంపిల్ గానే ఆ చూపించిన మంజుల పూర్తి వీడియోని ఇంకా విడుదల చేయలేదు.

ప్రోమోను బట్టి చూస్తే ఇళ్లు ఒకరకంగా ఇంధ్ర భవనంలా ఉంది.సకల సౌకర్యాలతో విలాసవంతంగా ఉంది.ఆ ఇంట్లో కృష్ణ భార్య విజయ నిర్మల విగ్రహం కూడా ఉంది.
ప్రస్తుతం కృష్ణ హోం టూర్ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ఆ వీడియోలో నాలుగైదు కార్లు, చుట్టూ కూర్చోవడానికి చక్కటి వాతావరణం, స్విమ్మింగ్ పూల్, తర్వాత ఇంటి లోపల ఇంద్ర భవనాన్ని తలపించే విధంగా సకల సౌకర్యాలు, హాల్ మొత్తం ఒక అల్మారా లో అవార్డులు అదేవిధంగా కృష్ణ, విజయనిర్మల ఫోటోలు ఉన్నాయి.
ఈ వీడియోని చూసిన ఘట్టమనేని అభిమానులు వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







