బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ మూడో రౌండ్ లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.అధికార కన్జర్వేటివ్ పార్టీలో ఇప్పటికే మొదటి రెండు రౌండ్లలో ఆధిక్యం సాధించిన రిషి సునాక్.
బ్రిటన్ ప్రధానమంత్రి కావాలంటే.మరో మూడు రౌండ్లలో తన అధిక్యతను ప్రదర్శించాల్సి ఉంటుంది.
రెండో రౌండ్ తర్వాత సునాక్ సహా మొత్తం ఐదుగురు బరిలో నిలిచారుమూడో స్థానంలో ఉన్న లిజ్ ట్రస్ కు 64 ఓట్లు వచ్చాయి.తొలి రౌండ్‌లో రిషి సునాక్‌కు 88 ఓట్లు, పెన్నీ మార్డాంట్‌కు 67, లిజ్ ట్రస్‌కు 50 ఓట్లు వచ్చాయి.మొదటి రౌండ్ లో 11మంది పోటీ పడగా.ఆరుగురికి 30కన్నా తక్కువ ఓట్లు రావడంతో తదుపరి రౌండ్లకు అనర్హులయ్యారు.
రెండో రౌండ్ లో ఒకరు అనర్హులు కాగా, ఐదుగురు మిగిలారు.
ఇప్పుడు మూడో రౌండ్ కోసం టెలివిజన్ చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నారు.
మొదటి చర్చాగోష్ఠి శుక్రవారం జరిగింది.ఈ చర్చాగోష్ఠిలో పన్నుల విధానంపై డిబేట్ నిర్వహించగా.
సునాక్ , లిజ్ ట్రస్ కు మధ్య హాట్ హాట్ గా వాదోపవాదాలు జరిగాయి.రెండో రౌండ్ లో మాజీ విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ మూడోస్థానంలో నిలిచారు.
అయితే, ఆమెకు కన్జర్వేటివ్ పార్టీలోని కొందరు సీనియర్ల నుంచి గట్టి మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది.రెండోస్థానంలో నిలిచిన కార్మికమంత్రి పెన్నీ మార్డాంట్ ను కూడా సునాక్ ఎదుర్కోవాల్సి ఉంటుంది కోవిడ్ 19 వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని పేరోల్ ట్యాక్స్ , కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా భర్తీ చేయాలన్న సునాక్ ప్రతిపాదనను ట్రస్ తోసిపుచ్చారు.
ఈ రెండు రకాల పన్నుల ద్వారా దాదాపు 3 వేల 600 కోట్ల అమెరికన్ డాలర్లు సమకూరుతాయని అంచనా.అయితే, పన్నులు పెంచడం వల్ల పెట్టుబడులు తగ్గుతాయని ట్రస్ వాదించారు.
ట్రస్ వాదన అంతా అద్భుతమైన కట్టుకథలా ఉన్నదంటూ సునాక్ హేళన చేయడం ఈ డిబేట్ లో కొసమెరుపు…మరోవైపు ప్రధాని రేసులో మిగిలిన ఐదుగురిపై ఒపీనియం అనే రీసెర్చ్ సంస్థ నిర్వహించిన స్నాప్ పోల్ లో టుజెంఢాట్ కు 36 శాతం, సునాక్ కు 24 శాతం, మార్డాంట్‌కు 12 శాతం, ట్రస్ కు 7 శాతం మంది మద్దతు తెలిపారు.ఇది బ్రిటన్ పౌర సమాజం నుంచి తీసుకున్న ఒపీనియన్ పోల్ అన్నది గమనార్హం.

అయితే, కన్జర్వేటివ్‌పార్టీ తరఫున బ్రిటన్ ప్రధాని పదవికి జరిగే ఈ ఎన్నికలో ఆ పార్టీ ఎంపీలు మాత్రమే పాల్గొంటారు.ప్రధాని రేసులో చాలామంది ఉండడంతో దశల వారీగా బ్యాలెట్ పోలింగ్ నిర్వహిస్తున్నారు.చివరికి ఒకరిని ఎన్నుకుంటారు.చివరిదశ పోలింగ్ కు ముందు పోటీలో ఇద్దరు అభ్యర్ధులు మిగిలే వరకూ రౌండ్లవారీగా కౌంటింగ్ కొనసాగుతుంది.ప్రస్తుతం బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు ఈరోజు మరో టెలివిజన్ డిబేట్ లో పాల్గొనాల్సి ఉన్నది.సోమవారం మూడో రౌండ్ పోలింగ్ జరగనున్నది.







