తూర్పుగోదావరి, రాజమండ్రి: ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు పాయింట్స్.జూలై మాసం ఇంతటి భారీ వరద రావడం అరుదైన ఘటన.1986లో ఇంతకు మించిన వరదలు సంభవించాయి.కాళేశ్వరం భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పడుతుంది.అక్కడ వరద తగ్గితే మనకు వరద ప్రభావం తగ్గుతుంది.పోలవరం లోయర్ కాఫర్ డ్యామ్ పూర్తిగా నీటమునిగింది.పోలవరం కాఫర్ డ్యామ్ 28 అడుగుల వరదకు అనుగుణంగా నిర్మించాము.
అప్పర్ కాఫర్ డ్యామ్ ఎత్తును మరొక మీటర్ పెంచేందుకు నిన్నటి నుంచి పనులు ప్రారంభించాము.
అప్పర్ కాఫర్ డ్యామ్ నీటి మునిగితే ఊహకందని నష్టం వాటిల్లుతుంది.ఈ రోజు రేపటి లోగా 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నాము.30 లక్షల క్యూసెక్కుల కు చేరే అవకాశం కూడా ఉంది.







