యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆనందంతో అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‘ సినిమా చేస్తున్నాడు.
అఖిల్ ఈ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.మరి ఈ సినిమా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.
ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం విదితమే.కానీ గత ఏడాది నుండి కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
దీంతో ముందు అనుకున్న రిలీజ్ డేట్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి.అందుకే ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ చేస్తామని చెప్పినా కూడా ఆ సూచనలు అయితే లేవు.
ఇక ఈ సినిమా నుండి అప్డేట్ కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇప్పటి వరకు చిన్న చిన్న పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న కూడా ఫ్యాన్స్ కు అవి సరిపోవడం లేదు.
అందుకే పెద్ద అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి ఎట్టకేలకు నిన్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు కూడా పెరుగుతూ పోతున్నాయి.

ఇక ఇప్పుడు వచ్చిన టీజర్ అయితే మరిన్ని అంచనాలను పెంచేసింది అనే చెప్పాలి.ఈ టీజర్ రిలీజ్ అయినా 13 గంటల్లోనే ఏకంగా 76 లక్షల వ్యూస్ తో 4 లక్షల లైక్స్ తో రికార్డ్ క్రియేట్ చేస్తుంది.మరి టైర్ 2 హీరోల సినిమాలకు ఈ రేంజ్ రెస్పాన్స్ అనేది ఎక్కువ అనే చెప్పాలి.
దీంతో ఈ సినిమా కోసం ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.







